సింగిల్ చార్జ్ తో 240 కి.మీ ప్రయాణించనున్న ఎలక్ట్రిక్ స్కూటర్

16 May, 2021 15:46 IST|Sakshi

బెంగళూరు: ఈ కరోనా మహమ్మరి కాలంలో వేగంగా విస్తరిస్తున్న రంగం ఏదైన ఉంది అంటే అది విద్యుత్ వాహన రంగం(ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్) అని చెప్పుకోవాలి. రోజు రోజుకి చమరు ధరలు పెరగుతుండటం ఇందుకు ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. అందుకే దేశ వ్యాప్తంగా అనేక ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌లు ప్రారంభించబడ్డాయి. అందులో ఒకటైన సింపుల్ ఎనర్జీ చివరకు తన మొదటి ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్క్ 2ను 2021 ఆగస్టు 15న అంటే స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారతదేశంలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. 

సింపుల్ ఎనర్జీ 2020లో ప్రోటోటైప్ వెర్షన్ మార్క్ 1 సిద్ధంగా ఉందని గతంలో వెల్లడించింది. అయితే, సంస్థ ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్ మార్క్ 2ను తీసుకురాబోతుంది. వాస్తవానికి, మార్క్ 2 మార్క్ 1పై ఆధారపడి ఉంటుంది. సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున, కంపెనీ ఈ తేదీని ఎంచుకుంది. అప్పటి వరకు దేశంలో పరిస్థితిలు బాగుంటాయాని సంస్థ అంచనా వేస్తుంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. సింపుల్ ఎనర్జీ మార్క్ 2ను సుమారు రూ.1,10,000 నుంచి 1,20,000 వరకు రిటైల్ కు వచ్చే అవకాశం ఉంది. బెంగళూరు నగరంలో ఆగస్టు 15న మార్క్ 2ను లాంచ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. సింపుల్ ఎనర్జీ ఆర్ అండ్ డీ కార్యాలయం, మొదటి ఉత్పత్తి కర్మాగారం కూడా బెంగళూరులో ఉన్నాయి. 

బెంగళూరులో ప్రారంభించిన వెంటనే కంపెనీ తన వ్యాపార కలపాలను చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర భారతీయ నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో, ఇతర నగరాల్లో కూడా తన ఉనికిని చాటుకోవాలని కంపెనీ యోచిస్తోంది. మార్క్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఎకో మోడ్‌లో సింగిల్ చార్జ్ తో 240 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. స్కూటర్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. 0-50 కిమీకి వేగాన్ని అందుకోవడానికి 3.6 సెకన్ల స్ప్రింట్ సమయం తీసుకుంటుంది. సుదీర్ఘ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సింపుల్ ఎనర్జీ స్కూటర్‌తో పోర్టబుల్ బ్యాటరీని అందిస్తోంది. ఇందులో టచ్‌ స్క్రీన్ డిస్ప్లే విత్ నావిగేషన్, బ్లూటూత్ వంటి ఇతర ఆసక్తికరమైన స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

చదవండి:

ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

మరిన్ని వార్తలు