హమ్మయ్య.. సింపుల్ వన్ డెలివరీలు మొదలయ్యాయ్ - అక్కడ మాత్రమే

8 Jun, 2023 11:30 IST|Sakshi

Simple One Electric Scooter: గత కొన్ని నెలల నిరీక్షణ తరువాత 'సింపుల్ ఎనర్జీ' దేశీయ మార్కెట్లో ఇటీవల 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కంపెనీ డెలివరీలను కూడా ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, సింపుల్ ఎనర్జీ సుమారు ఒక లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ స్వీకరించింది. అయితే ఇప్పుడు కేవలం 15 యూనిట్లను మాత్రమే డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం డెలివరీలు కేవలం బెంగళూరులో మాత్రమే ప్రారంభమయ్యాయి. త్వరలోనే దేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

(ఇదీ చదవండి: రెపో రేటుపై ఆర్‌బీఐ ప్రకటన.. కీలక వడ్డీ రేట్లు యధాతథం)

సింపుల్ ఎనర్జీ కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 40 నుంచి 50 నగరాల్లో 160 నుంచి 180 రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. వీటి ద్వారానే కంపెనీ దేశంలో తన ఉనికిని విస్తరాయించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.45 లక్షలు. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 212 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక డిజైన్, ఫీచర్స్ పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది.

మరిన్ని వార్తలు