Simple One: దూసుకెళ్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్

20 Aug, 2021 15:13 IST|Sakshi

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ అనే రెండు కొత్త దేశీయ కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్లు వస్తూ వస్తూనే ఒక సంచలనాన్ని క్రియేట్ చేశాయి. అప్పటికే వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఉన్న మార్కును ఇవి తుడిపేసి కొత్త మార్కును క్రియేట్ చేశాయి. ఓలా ఎలక్ట్రిక్ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటలలోపే లక్ష మందికి వాటిని బుక్ చేసుకున్నారు. దీంతో ఓలా కంపెనీ ప్రపంచ రికార్డు సాధించింది. తాజాగా ఓలా కంపెనీ ధీటుగా అంతే స్థాయిలో బుకింగ్స్ వచ్చినట్టు బెంగళూరు స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ ప్రకటించింది.‎ 

‎సింపుల్ వన్ ‎‎ఎలక్ట్రిక్ స్కూటర్‎‎ కోసం 30,000కు పైగా ప్రీ బుకింగ్స్ వచ్చినట్లు బెంగళూరుకు చెందిన ఈవీ తయారీసంస్థ సింపుల్ ఎనర్జీ ప్రకటించింది.‎ ఎటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ లేకుండా మార్కెట్లోకి వచ్చినప్పటికీ ఈ సింపుల్ వన్ ‎‎ఎలక్ట్రిక్ స్కూటర్‎‎ కు అద్భుతమైన స్పందన లభించింది. కస్టమర్లు స్కూటర్ బుక్ చేయడం కోసం ప్రయత్నిస్తుంటే సాంకేతిక సమస్యలు వచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకేసారి ఎక్కువ మంది ప్రీ ఆర్డర్ల కోసం ప్రయత్నించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు, ఆ తర్వాత ఆ సమస్యను పరిష్కరించినట్లు కంపెనీ పేర్కొంది. సింపుల్ ఎనర్జీ ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా స్కూటర్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు ఈ రెండు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి.(చదవండి: Afghanistan: ‘సిగ్గుందా? శవాలపై వ్యాపారమా?’)

మరిన్ని వార్తలు