మీరు క్రెడిట్‌ కార్డ్‌ బిల్‌ పే చేయలేకపోతున్నారా?!

17 Jul, 2021 11:45 IST|Sakshi

ప్రస్తుతం కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఉద్యోగాలు కోల్పోయి, బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు, క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మాత్రం చేతిలో సమయానికి డబ్బులున్నా వాటిని ఏ విధంగా చెల్లిస్తే ఆర్ధిక సమస్యల నుంచి బయటపడొచ్చో తెలుసుకోలేకపోతున్నారు. క్రెడిట్‌ కార్డ్‌ల విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ క్రెడిట్‌ కార్డ్‌ ఉచ్చునుంచి సురక్షితంగా ఉండొచ్చు. 

ఈఎంఐ సౌకర్యం ఉంది : మనం ఏదైనా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగిస్తే నిర్ణీత సమయంలో పే చేయాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంక్‌లు విధించే 30 నుంచి 40శాతం వడ్డీలపై వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. పైగా వడ్డీ పడకుండా చెల్లించే నిర్ణీత గడువును కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే పెద్ద మొత్తంలో ఈఎంఐ చెల్లించే వారికి కొన్ని బ్యాంక్‌లు ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. ఆ సదుపాయాన్ని వినియోగించుకుంటే అధిక వడ్డీ నుంచి సురక్షితంగా ఉండొచ్చు. విపత్కర పరిస్థితుల నుంచి సులభంగా బయటపడొచ్చు. 

అప్పులన్నీ ఒకేసారి తీరుస్తున్నారా: ఉన్న అప్పులన్నీ ఒకే సారి తీర్చాలని నానా కష‍్టాలు పడుతుంటారు. అలా కాకుండా అప్పు ఎంత ఉన్నా భాగాలుగా విభజించి చిన్న మొత్తంలో చెల్లిస్తే కొన్ని నెలలకు, లేదంటే సంవత్సరాలకు ఆ ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐ కూడా అంతే . ఉదాహరణకు బ్యాంక్‌ ఇచ్చిన తేదీకి క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు రూ. 50 వేలు చెల్లించాలి. మీ దగ్గర అంత డబ్బు లేదని నానా హైరానా పడుతుంటారు. కుటుంబసభ్యుల్నో,స్నేహితుల్నో అడిగి క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు పే చేస్తుంటారు. అలా కాకుండా ఉన్న రూ.50వేల మొత్తాన్ని 10నెలల పాటు నెలకు రూ.5 వేలు కట్టుకుంటే మీపై భారం తగ్గిపోతుంది. అందుకోసం బ్యాంక్‌ అధికారుల్ని ఆశ్రయించాల‍్సి ఉంటుంది. బ్యాంక్‌ను బట్టి ఈఎంఐ అమౌంట్‌, గడువు ఉంటుంది.  

ఈఎంఐ గా మార్చుకోండి : అవసరం ఉందని క్రెడిట్‌ కార్డ్‌ తీసుకునేముందు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. క్రెడిట్‌ కార్డ్‌లపై బ్యాంక్‌లు విధించిన పరిమితి దాటినప్పుడు ఈఎంఐ మార్చుకునే అవకాశం ఉందా? లేదా?అని తెలుసుకోవాలి. మ్యాక్సిమం అన్ని బ్యాంకులు ఈఎంఐ సదుపాయాన్ని ఇస్తాయి. కాకపోతే రేట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ గురించి ఆరాతీయండి. పొరపాటున క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు మీ పరిధి దాటితే  ఈఎంఐగా మార్చుకోవచ్చు. 

వేరే బ్యాంక్‌ నుంచి పే చేయండి : మీరు రెండు మూడు క్రెడిట్‌ కార్డ్‌లు వాడుతుంటే ఒక బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ బిల్లును మరో బ్యాంక్‌ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది.  క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ బిల్లును ఈఎమ్ఐగా మార్చుకునేందుకు ప్ర‌స్తుతం ఉన్న కార్డు జారీదారులు నిరాక‌రించినా, ఇందుకోసం ఎక్కువ వ‌డ్డీ రేటు వ‌సూలు చేసినా ఈ ఆప్ష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ముందే తెలుసుకోండి : నెల వారీ పరిధి దాటి చెల్లించే క్రెడిట్‌ కార్డులకు  23 నుంచి 49 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అదే ఉన్న మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకొని చెల్లిస్తే ఇంట్రస్ట్‌ తక్కువ పడుతుంది. నిర్ణీత సమయంలో క్రెడిట్‌ కార్డ్‌ బిల్‌ పే చేయండి లేదంటే మీరు క్రెడిట్‌ కార్డ్‌పై చెల్లించే వడ్డీ రేటు, ఇతర బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డ్‌లపై చెల్లించే వడ్డీ రేట్లు ఎంత ఉంటాయో తెలుసుకోవాలి. ఆ తరువాతనే పే చేయండి. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు