ఐటీ నిపుణులకు శుభవార్త: భారీ జీతాలు, ప్రోత్సాహకాలు 

28 Apr, 2021 16:18 IST|Sakshi

డిజిటల్‌ విభాగంలో ఉద్యోగాలకు భారీ ఢిమాండ్‌

నైపుణ్యం గల ఉద్యోగులకోసం కంపెనీల మధ్య తీవ్ర పోటీ

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ కాలంలో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ఐటీనిపుణులు ఒక్కొక్కరికీ మూడు నుంచి నాలుగు ఆఫర్లు వస్తున్నాయట. అంతేకాదు 50-70 శాతం మంది జీతాల పెంపుతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కోవిడ్‌-19 కారణంగా డిజిటల్ నైపుణ్యాలకు డిమాండ్‌ భారీగా పుంజుకుందని రిక్రూటింగ్‌ సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫుల్‌ స్టాక్ డెవలపర్లు, బిగ్‌ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డెవలరపర్లు, క్లౌడ్ ఇంజనీర్లు, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్‌ ఆటోమేషన్ అధిక డిమాండ్ ఉన్నవిభాగాలుగా రిక్రూటర్లు పేర్కొంటున్నారు. ఈ రంగాల్లో నియమాకాల్లో దాదాపు 30-35శాతం పెరుగుదల, 50-70 శాతం వరకు జీతాల పెంపు కనిపిస్తోందని తెలిపారు.

గత ఏడాదిలాక్‌డౌన్‌ కారణంగా ఐటీ మినహా ఇతర రంగాల్లో లక్షలాదిమంది ఉపాధిని కోల్పోయారు. ఐటీరంగంలో డిజిటల్‌ రంగంలో ఉద్యోగాలకు భారీ డిమాండ్‌ పెరిగింది. ఐటీ డిజటల్‌ విభాగంగా బోలెడన్ని అవకాశాలున్నాయి.ఈ రంగంలో నిపుణులకు పెద్ద మొత్తంలో చెల్లించేందుకు ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నారని రాండ్‌స్టాడ్ ఇండియా యెషాబ్ గిరి అన్నారు.డిమాండ్‌ ఎక్కువ సరఫరా తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రధాన ఐటీ సంస్థలమధ్య ప్రతిభావంతులకోపం పెద్ద పోటీ నెలకొందన్నారు. భారతీయ ఐటీ పరిశ్రమలో ప్రతిభావంతుల కోసం యుద్ధం జరుగుతోంది. ప్రధాన ఐటీ కంపెనీల క్యూ4 ఫలితాలు ఆదాయాలు, ఆట్రిషన్‌ (కంపెనీనుంచి వలసలు) భారీ ఒప్పందాలే దీనికి తార్కాణమని వెల్లడించారు. వారికి ఆకర్షణీయ జీతాలు, బోనస్‌లు ,ప్రోత్సాహకాలు భారీగా లభించనున్నాయని ఏబీసీ కన్సల్టింగ్ సీనియర్ డైరెక్టర్ (టెక్నాలజీ) రత్న గుప్తా అన్నారు. డ్రాప్-అవుట్ రేట్లు కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి 10 జాబ్ ఆఫర్లకు, వాటిలో 4-5 ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. అంటే దాదాపు 40-50 శాతంగా ఉంది. దీంతో అభ్యర్థులను ఎంపిక చేయడం అటు కంపెనీలకు, ఇటు నియామక సంస్థలకు సవాలుగా మారిందని గిరి తెలిపారు.

అట్రిషన్ రేటు ఐటీ మేజర్‌ టీసీఎస్‌లో 7.2 శాతంగా ఉండగా, తమవద్ద 15 శాతంగా ఉందని ఇన్ఫోసిస్ క్యూ 4 ఫలితాల సందర్భంగా తెలిపింది. రానున్న రెండు త్రైమాసికాలలో కూడా ఇది  కొనసాగే అవకాశం ఉందని  అంచనా వేసింది. అలాగే విప్రో, 12.1 శాతం, హెచ్‌సిఎల్ టెక్ 9.9 శాతం అట్రిషన్‌ను నమోదు చేసింది, రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత పెరగవచ్చని అంచనా. గతేడాది అట్రిషన్ 10-12శాతం మాత్రమే.  కాగా 2021-22లో లక్షకు పైగా ఫ్రెషర్లను తీసుకోనున్నామని టీసీఎస్‌, ఇన్ఫోసిస్, విప్రో హెచ్‌సిఎల్ టెక్ ఇప్పటికే ప్రకటించాయి. 

మరిన్ని వార్తలు