షాకిచ్చిన స్కోడా.. ఆ మోడల్‌ ధరలు పెంపు

5 May, 2022 20:27 IST|Sakshi

ఇండియన్‌ రోడ్లపై తనదైన ముద్ర వేసిన స్కోడా సైతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎటువండి హడావుడి లేకుండా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కేటగిరీలో స్కోడా కుషాక్‌ ధర పెంచింది. హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌కి పోటీగా కుషాక్‌కు గతేడాది మార్కెట్‌లోకి తెచ్చింది. కుషాక్‌ ఎంట్రీ లెవల్‌ యాక్టివ్‌ వేరియంట్‌ ధర రూ. 10.49 లక్షలు ఉండగా ఈ మోడల్‌పై రూ.30,000ల వరకు ధర పెరిగింది. ఇక కుషాక్‌లో హై ఎండ్‌ వేరియంట్‌ స్టైల్‌ ధర రూ.17.19 లక్షలు ఉండగా కొత్తగా మరో రూ.70,000 ధర పెంచింది స్కోడా. ఈ మేరకు పెరిగిన రేట్లను స్కోడా వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసింది.

మరిన్ని వార్తలు