Tata Nexon EV: దిగ్గజ కంపెనీల మధ్య అమ్మకాల పోటీ, భారీగా తగ్గిన టాటా ఎలక్ట్రిక్‌ కారు ధర

22 Jan, 2023 15:49 IST|Sakshi

దేశీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో దిగ్గజ సంస్థల మధ్య పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అమ్మకాల్లో ఒక సంస్థతో మరో సంస్థ పోటీపడుతున్నాయి. ఇటీవల మహీంద్రా అండ్‌ మహీంద్ర ఈవీ ఎస్‌యూవీ 400ను విడుదల చేసింది. ఆ కారు విడుదలైన మరుసటి రోజే ఈవీ మార్కెట్‌లో కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న నెక్సాన్‌ ఈవీ కారు ధరల్ని తగ్గిస్తూ టాటా మోటార్స్‌ నిర్ణయం తీసుకుంది.

నెక్సాన్‌ వేరియంట్‌కు పోటీగా ఎక్స్‌యూవీ 400 మార్కెట్‌లో విడుదలైంది. దాని ధర రూ.18.99 లక్షలుగా ఉంది. ఇప్పుడు దానికి గట్టిపోటీ ఇచ్చేలా నెక్సా ఈవీ ధరల్ని తగ్గించడం గమనార్హం. నెక్సాన్‌ ఈవీ కారు ఇంత‌కుముందు రూ.14.99 ల‌క్ష‌లు ఉండగా.. ధర తగ్గించడంతో ఇప్పుడు అదే కారును రూ.14.49 ల‌క్ష‌ల‌కే సొంతం చేసుకోవచ్చు. నెక్సాన్‌ వేరియంట్‌లో లేటెస్ట్‌గా విడుదలైన నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌ ధర రూ. 16.49లక్షలుగా ఉంది.

వ్యూహాత్మకంగా
ఈ సందర్భంగా టాటా మోటార్స్‌ మార్కెటింగ్‌ హెడ్‌ వివేక్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ..మేం పక్కా స్ట్రాటజీతో టియాగో నుంచి నెక్సాన్‌ ఈవీ కార్ల వరకు  కస్టమర్లను ఆకట్టుకునేలా తయారు చేస్తున్నాం. స్మార్ట్ ఇంజనీరింగ్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మా లక్ష్యాలను చేరుకునేందుకు దోహదం చేస్తున్నాయి. కొనుగోలు దారుల అభిరుచులకు అనుగుణంగా కార్లను అందియ్యగలుగుతున్నామని అన్నారు. 

టాటా మోటార్స్‌ ఫోర్ట్‌ పోలియోలో మూడు ఈవీ కార్లు 
టాటా మోటార్స్‌ ఫోర్ట్‌ ఫోలియోలో టియాగో, టైగోర్‌,నెక్సాన్‌ ఈ మూడు ఎలక్ట్రిక్‌ కార్లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.18.99లక్షల మధ్యలో ఉన్నాయి. ఇక ఎంట్రీ లెవల్‌ టిగాయో యూవీ మార్కెట్‌ ప్రారంభ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79లక్ష మధ్యలో ఉండగా టిగోర్‌ ఈవీ ప్రారంభ ధర రూ.12.49లక్షల నుంచి రూ.13.75లక్షల మధ్య ధరతో సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు