Sleep Aid Handheld Device: నిద్ర సరిగ్గా పట్టడం లేదా..

5 Sep, 2021 09:02 IST|Sakshi

ఈ మధ్యకాలంలో ఆన్‌ లైన్‌ చాటింగ్‌లు, బ్రౌజింగ్‌లు.. నిద్రను దోచుకుని, శరీరంలో ప్రతికూలమైన మార్పులు తెచ్చిపెడుతున్నాయి. నిద్రలేమితో ముఖం పాలిపోయి..కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి.. ఎంతటి కళ గల ముఖమైనా డల్‌గా మారిపోతుంది. నిజానికి సరైన నిద్రే సౌందర్య రహస్యం అంటారు నిపుణులు. దానికి చక్కని బహుమతి..హ్యాండ్‌ హెల్డ్‌ స్లీప్‌ ఎయిడ్‌  ఇస్ట్రుమెంట్‌. కంటినిండా నిద్రను తెచ్చి..ముఖ వర్చస్సును పెంచుతుంది. 

చిత్రంలోని ఈ మైక్రో–కరెంట్‌ స్మార్ట్‌ హిప్నాసిస్‌ ఇస్ట్రుమెంట్‌..హైటెక్నాలజీతో రూపొందింది. ఈ పరికరం ప్రధానంగా తగినంత నిద్ర లేకుండా బాధపడేవారికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది. ఈ డివైజ్‌ని చేతితో పట్టుకుని, రిలాక్స్‌డ్‌గా కళ్లు మూసుకుంటే చాలు.. మెదడులోని కండరాలను ఉత్తేజపరచి.. కళ్ల మీద నిద్రను మోసుకొస్తుంది. ఇది సురక్షితమైనది.. తేలికైనది..పరిమాణంలో చిన్నది. పోర్టబుల్‌ మాత్రమే కాదు సులభంగా ఆపరేట్‌ చేసుకోవచ్చు. దీనిలో వర్కింగ్‌ మోడ్స్‌ ఉంటాయి. తక్కువ ఫ్రీక్వెన్సీకి డికంప్రెషన్‌ మోడ్, హై ఫ్రీక్వెన్సీకి ఎగ్జిటేషన్‌ మోడ్‌ నొక్కాలి. తీవ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి  ప్లస్‌ మైనస్‌ బటన్‌ నొక్కాలి.

ఈ స్లీప్‌ ఎయిడ్‌ పరికరాన్ని ఆఫీసులో ఇంట్లో, వ్యాపార పర్యటన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. సుమారు 15 నిమిషాలు వాడితే.. తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. దీన్ని చేతికి బ్రేస్‌లెట్‌లా  వేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన బ్యాండ్‌ ఉంటుంది. ఆ పరికరాన్ని చేతికి పెట్టుకొని నిద్రపోతే  తెల్లవారాక.. ఆ రోజు ఉల్లాసంగా.. ఉత్సాహంగా  మొదలవుతుంది. దీని ధర సుమారు 30 డాలర్లు. అంటే సుమారు రూ. 2,200.

మరిన్ని వార్తలు