స్లైస్‌ కార్డు యూజర్లకు అలెర్ట్‌, ఇక ఆ కార్డులు పనిచేయవ్‌!

29 Oct, 2022 22:00 IST|Sakshi

స్లైస్‌ కార్డు యూజర్లకు ముఖ్య గమనిక. ఆర‍్బీఐ నిబంధనల మేరకు స్లైస్‌ కార్డు తన ప్రీపెయిడ్‌ కార్డు సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబరు చివరి నుంచి ఈ కార్డులు వినియోగించే అవకాశం ఉండదని పేర్కొంది.  

ఆర్బీఐ నిబంధనల మేరకు స్లైస్‌ తరహా సంస్థలు లోన్‌లు ఇవ్వడం, తిరిగి చెల్లించే ట్రాన్సాక్షన్‌లు ఇకపై అన్నీ బ్యాంక్‌ అకౌంట్‌ల నుంచి జరపాల్సి ఉంది. ఇందులో భాగంగా స్లైస్‌ వినియోగదారులకు ఇచ్చే రుణాల్ని ఇకపై బ్యాంకు అకౌంట్‌లకే ట్రాన్స్‌ చేయనున్నట్లు తెలిపింది. 

ప్రస్తుతం ఉన్న స్లైస్‌ కార్డులో ఉన్న నగదు రోజువారీ ట్రాన్సాక్షన్‌లకు ఉపయోగించుకోవచ్చు. స్లైస్‌ బారో పేరిట లోన్‌లు, యూపీఐ పేమెంట్స్‌ కోసం స్లైస్‌ యూపీఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపింది.    

మరిన్ని వార్తలు