తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు.. స్టాక్‌మార్కెట్‌ వైపు జనాల అడుగులు

11 Jul, 2021 13:04 IST|Sakshi

ముంబై : స్టాక్‌మార్కెట్‌, మ్యుచవల్‌ ఫండ్స్‌ పట్ల భారతీయుల్లో ఉన్న భయాలు క్రమంగా తొలగిపోతున్నాయి. రిస్క్‌ ఎక్కువని ఇంత కాలం వీటికి దూరంగా ఇండియన్లు తాజాగా స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీని బ్యాంకులు ఆఫర్‌ చేస్తుండటంతో.. రిస్క్‌ ఉన్నా పర్వాలేదనే ధోరణి స్మాల్‌ ఇన్వెస్టర్లలో  పెరుగుతోంది.

‘మార్కెట్‌’పై ఆసక్తి
గత ఆర్థిక సంవత్సరంలో 1,.42 లక్షల మంది కొత్తగా స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. ఇందులో 1.22 లక్షల మంది సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ దగ్గర ఖాతాలు ప్రారంభించగా మరో 19.7 లక్షల మంది నేషనల్‌ సెక్కూరిటీ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ దగ్గర ఖాతాలు ఓపెన్‌ చేశారు. ఇటీవల కాలంలో ఏకంగా 44 లక్షల మంది రిటైల్‌ ఇన్వెస్టర్లుగా రిజిస్ట్రర్‌ అయ్యారు. 

తగ్గిన వడ్డీ
కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు బ్యాంకుల వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీగా తగ్గించింది. ముఖ్యంగా రిస్క్‌ లేకుండా గ్యారంటీ రిటర్న్‌గా పేరున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అయితే మరీ దారుణంగా వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ఇన్వెస్టర్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆసక్తి కోల్పోతున్నారని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.

విత్‌డ్రాకే మొగ్గు
గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లు 150 ట్రిలియన్‌ మార్క్‌ని టచ్‌ చేసింది. ఈసారి 2021 ఏప్రిల్‌ 21 నుంచి మే 21 వరకు కేవలం రూ. 32,482 కోట్లు డిపాజిట్లే బ్యాంకులో జమ అయినట్టు అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచవల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా తెలియజేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయానికి బ్యాంకు డిపాజిట్ల మొత్తం రూ. 1.20 ట్రిలియన్లుగా ఉంది. చాలా మంది తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కొనసాగించడం లేదనే దానికి ఈ గణాంకాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

మ్యూచువల్స్‌కి మళ్లింపు
మరోవైపు 2021 మేలో మ్యూచువల్‌ ఫ​ండ్స్‌కి భారీగా నగదు పోటెత్తింది. ఏకంగా రూ. 10,000 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో మే చివరి నాటికి మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ గతంలో ఎన్నడూ లేనతంగా రూ. 33 లక్షల కోట్లను టచ్‌ చేసినట్టు ఓమ్‌ ( అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ AUM) తెలిపింది. 

సెబి లెక్కలు
మ్యూచవల్‌ ఫండ్‌ మేనేజర్లు చెబుతున్న లెక్కలను సెబీ గణాంకాలు బలపరుస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.42 కోట్ల డిమ్యాట్‌ అకౌంట్లు పప్రారంభం అయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 49 లక్షలకే పరిమితమైంది. దాదాపు మూడింతలు డిమ్యాట్‌ అకౌంటర్లు పెరిగాయి.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు