ఇక మీ ప‌ని అయిపోయిన‌ట్లే.. మేము వచ్చేస్తున్నాం!

15 Oct, 2021 18:33 IST|Sakshi

ప్రపంచం చాలా వేగంగా దూసుకెళ్తుంది.. ఎంతగా అంటే ప్రస్తుత పరిస్దితుల్లో మనుషులు చేసే పనులను కూడా రోబోలతో చేయిస్తున్నాము. మనుషులకు వీలుకానీ పనులను కూడా రోబోల సహాయంతో సునాయాసంగా చేసేస్తున్నాము. నేటికాలంలో రోబోలు లేని రంగం లేదు, అయినా మనిషి ఆశ తీరడం లేదు. ఇంకా తాను చేయలేని పనులెన్నింటినో రోబో చేత చేయిస్తున్నాడు. అందుకని, వాటికి కృత్రిమ మేధను జోడించాడు. పక్షులూ జంతువుల కదలికలు నేర్పాడు. ఎక్కడికక్కడ మనిషి అవసరానికి తగిన ఆకారాన్నిచ్చాడు. 

ఈ క్రమంలోనే బోస్టన్ డైనమిక్స్ గ్రూప్ నుండి వచ్చిన ఒక క్వాడ్రప్డ్ రోబో కుక్క చూడాటానికి నిజమైన కుక్కలాగే కనిపిస్తుంది. ఈ క్వాడ్రప్డ్ రోబోట్ కుక్కలను సైనికులకు సహాయం చేయడానికి పరీక్షిస్తున్నారు. యుఎస్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ నిర్మించిన ఒక ప్రసిద్ధ క్వాడ్రప్డ్ కుక్కను శత్రువులు సవాలు చేసే భూభాగాన్ని రక్షించడానికి ఫ్రెంచ్ మిలిటరీ ఇటీవల పరీక్షించింది. వీటిలో కెమెరాలు, రిమోట్ కంట్రోల్ ఉంటాయి. ఇప్పుడు ఘోస్ట్ రోబోటిక్స్ అనే యుఎస్ సంస్థ క్వాడ్రుపెడల్ మానవరహిత గ్రౌండ్ వెహికల్స్(క్యుజివిలు) అనే క్వాడ్రప్డ్ రోబోట్‌లను తయారు చేస్తుంది. అసోసియేషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ 2021 వార్షిక సదస్సులో ఈ యంత్రాన్ని మొదటిసారి ప్రదర్శించారు. 
(చదవండి: జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి)

అయితే, రోబోట్‌లను సైనికులకు సహాయం చేసేందుకు తయారు చేస్తున్నారు. ఈ  క్వాడ్రప్డ్ రోబోట్‌లు చిత్తడి ప్రాంతాలలో వారికి సహాయం చేస్తాయి. QUGV రోబోట్లు చిన్న స్వోర్డ్ ఇంటర్నేషనల్ కస్టమ్ గన్ కలిగి ఉంటాయి. ఇది 30ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగి ఉంది. రోబోట్ కుక్కలను విజన్ 60 యుజివిలు లేదా "స్వయంప్రతిపత్త మానవరహిత గ్రౌండ్ వెహికల్స్" అని పిలుస్తారు. వీటిని ఘోస్ట్ రోబోటిక్స్ ఆఫ్ ఫిలడెల్ఫియా తయారు చేసింది. చీకటిలో లక్ష్యంగా చేరుకోవడానికి థర్మల్ కెమెరా కలిగి ఉంది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డాటా అనలిటిక్స్ ఆధారంగా ఇది పనిచేస్తాయి. క్షిపణులు లేదా ఇతర మార్గాలల్లో శత్రు దేశాలు మాతృభూమిపై చేసే దాడులను పసిగట్టి, సమాచారాన్ని చేరవేస్తాయి. భవిష్యత్ యుద్ధభూమిలో, శత్రువుతో సమర్థవంతంగా పోరాడటానికి ఎంతో ఉపయోగపడతాయి.

(చదవండి: క్రికెట్ ప్రియులకు ఇక పండగే.. మల్టీప్లెక్స్‌ల్లో టీ-20 ప్రపంచకప్‌ లైవ్ మ్యాచ్‌లు)

మరిన్ని వార్తలు