మార్కెట్‌లోకి మ‌రో 5జీ స్మార్ట్‌ఫోన్‌, విడుద‌లైన‌ ఐకూ జెడ్‌3

9 Jun, 2021 09:18 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐకూ సంస్థ ‘ఐకూ జెడ్‌3’ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో అద్భుతమైన కెమెరా టెక్నాలజీ, మంచి హార్డ్‌వేర్‌ ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్‌ 768జీ 5జీ ప్రాసెసర్‌ను ఇందులో ఏర్పాటు చేసింది. అంటే 5జీకి సపోర్ట్‌ చేస్తూ మంచి గేమింగ్‌ అనుభవాన్ని ఇచ్చేందుకు ఈ ప్రాసెసర్‌ను వినియోగించింది. 64మెగాపిక్సల్‌ ఆటోఫోకస్‌ కెమెరా వెనుక భాగంలో ఉంటుంది. 55వాట్‌ ఫ్లాష్‌ చార్జ్‌తో వస్తంది.  6జీబీ, 128జీబీ రకం ధర రూ.19,900 కాగా.. 8జీబీ, 128జీబీ ధర రూ.20,990గా కంపెనీ నిర్ణయించింది. అదే విధంగా 8జీబీ, 256 జీబీ వేరియంట్‌ ధర రూ.22,990. అమెజాన్‌ డాట్‌ ఇన్, ఐకూ డాట్‌కామ్‌ పోర్టళ్లలో విక్రయానికి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.  

చ‌ద‌వండి : Samsung Galaxy S21+: రూ.10వేల క్యాష్ బ్యాక్, ఇంకా మ‌రెన్నో ఆఫ‌ర్స్‌

మరిన్ని వార్తలు