ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్‌.. స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌ డౌన్‌

29 Jan, 2023 15:32 IST|Sakshi

ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆర్ధిక మాంద్యం భయాలు ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం..ప్రపంచంలోనే రెండు అతిపెద్ద స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లైన భారత్, చైనాలలో స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలు పూర్తిగా తగ్గినట్లు తెలిపింది. అయితే చైనా కంటే భారత్‌లో ఈ పరిణామం ఎక్కువగా ఉండటం స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. 

ఎంట్రీ లెవెల్‌, బ‌డ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల సేల్స్‌ తగ్గినట్లు తెలిపింది కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌. 2021తో పోలిస్తే 2022లో భార‌త్‌లో స్మార్ట్ ఫోన్ సేల్స్ 9 శాతం త‌గ్గి గ‌తేడాది కేవ‌లం 152 మిలియ‌న్ల స్మార్ట్ ఫోన్లు మాత్ర‌మే అమ్ముడ‌య్యాయి.  విచిత్రం ఏంటంటే ఓవ‌రాల్‌గా స్మార్ట్ ఫోన్ల విక్ర‌యాలు త‌గ్గినా.. రూ.30 వేల కంటే పై చిలుకు స్మార్ట్ ఫోన్ల సేల్స్ మాత్రం రికార్డ్‌ స్థాయిలో 35 శాతం పెరగడం గమనార్హం. 

లేటెస్ట్‌ 5జీ టెక్నాలజీ ఫోన్‌ల అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయి. 2021లో స్మార్ట్ ఫోన్ల విక్ర‌యం 19 శాతం పెరిగితే, 2022లో అది 32 శాతం వృద్దిరేటును నమోదు చేసింది. 5జీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో శామ్‌ సంగ్ 21 శాతం వాటాతో మొద‌టి స్థానంలో ఉండగా.. సేల్స్ ఆదాయంలోనూ 22 శాతంతో ముందంజలో ఉంది. 

మరిన్ని వార్తలు