గతేడాది హాట్‌కేకుల్లా అమ్ముడైన ఫోన్‌లు ఇవే! ఏ ఫోన్‌లు ఎక్కువగా అమ్ముడయ్యాయంటే?

24 Mar, 2022 12:30 IST|Sakshi

వ‌ర‌ల్డ్ వైడ్‌గా స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో భార‌త్ రెండో స్థానంలో కొన‌సాగుతుంది.ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ గ‌తేడాది ఫ్లాగ్‌షిప్, మిడ్ రేంజ్, బడ్జెట్ ఫోన్‌లు ఎన్ని అమ్ముడ‌య్యాయి? మెట్రోలతో పోలిస్తే టైర్-2 నగరాలు, పట్టణాల నుండి డిమాండ్ ఎలా ఉంది? మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి యూజ‌ర్ల అభిరుచి ఎలా ఉంద‌నే ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది.  

గతేడాది అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో దాదాపు 30శాతం వృద్ధిని కనబరిచింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు కేవలం టైర్-1 నగరాల ద్వారా మాత్రమే కాకుండా టైర్-2, టైప్‌-3 న‌గ‌రాల్లో ఎక్కువ అమ్ముడైన‌ట్లు అమెజాన్ ఇండియా డైరెక్ట‌ర్ నిశాంత్ సర్దానా తెలిపారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్ గేమింగ్‌, ఓటీటీ కంటెంట్ వినియోగంతో స్మార్ట్‌ఫోన్‌ల అవ‌స‌రం ఎక్కువైంద‌ని, దీంతో కొనుగోలు దారుల సంఖ్య పెరిగిన‌ట్లు చెప్పారు. 

అందుకే ప్రాసెసర్, మెమరీ స్పేస్, బ్యాటరీ లైఫ్‌ టైమ్‌, స్మూత్ అమోలెడ్‌ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో కొనుగోలు దారులు రాజీపడడం లేదన్నారు. దీనికి తోడు భవిష్యత్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌లు ఎప్పుడు విడుదల కానున్నాయనే అంశంలో యూజర్లకు అవగాహన పెరిగిందని, తద్వారా యూజర్లు తమకు ఎలాంటి స్మార్ట్‌ ఫోన్‌లు నప్పుతాయో ముందే తెలుసుకోవడాన్ని గమనించినట్లు నిశాంత్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమెజాన్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ ఫోన్‌ వివరాల్ని వెల్లడించారు. ఆ వివారలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.  

అమెజాన్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే 

అమెజాన్ ఇండియాలో జరిగిన సేల్స్‌ ఆధారంగా టైర్-2 నగరాలు, చిన్న పట్టణాల నుండి డిమాండ్‌ పెరిగినట్లు స్పష్టం చేశారు. అమెజాన్‌ విక్రయిస్తున్న నాలుగు స్మార్ట్‌ ఫోన్‌లలో మూడు స్మార్ట్‌ఫోన్‌లు టైర్‌-2 నగరాలు, పట్టణాల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి అమెజాన్‌లో అమ్ముతున్న సగం కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్‌లు టైర్-2 లేదా చిన్న నగరాల నుండి వచ్చినవే”అని  నిశాంత్‌ సర్ధానా పేర్కొన్నారు. 

అమెజాన్‌ రూ.20వేల స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో బలమైన వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. 

రెడ్‌ మీ నోట్‌ సిరీస్‌,వన్‌ ప్లస్‌,శాంసంగ్‌ ఎం సిరీస్‌, ఐక్యూ, టెక్నాస్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలులో కస్టమర్లు పెరుగుతున్నారు.  

అమ్ముడయ్యే నాలుగు ఫోన్‌లలో మూడింటిని టైర్-2 నగరాలు, పట్టణాల నుండి కస్టమర్‌లు కొనుగోలు చేస్తున్నారు. 

 వన్‌ ప్లస్‌ రూ.25వేల స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ ఉందని అమెజాన్‌ తెలిపింది.  

అంతేకాదు రూ.20వేల నుంచి రూ.30 వేలు..రూ.30వేల నుంచి రూ.40వేలు, రూ.40వేల నుంచి రూ.50వేల ధ‌ర మ‌ధ్య ఉన్న ఫోన్ల డిమాండ్‌ వరుసగా 52శాతం, 61శాతం వృద్ధిని చూశాయ‌ని అన్నారు. ఇక ఎక్కువ‌గా అమ్ముడైన బ్రాండ్‌ల‌లో రెడ్‌మీ నోట్ సిరీస్‌, వ‌న్ ప్ల‌స్‌,శాంసంగ్ ఎం సిరీస్ ఫోన్‌లు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

చదవండి: సేల్స్‌ బీభత్సం..! 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన ఫోన్‌లు అమ్ముడయ్యాయి!

మరిన్ని వార్తలు