ఒకప్పుడు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌.. ఇప్పుడు స్నాప్‌చాట్‌

28 Oct, 2021 08:40 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజాలుగా ఉన్న ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ బాటలోనే పయణిస్తోంది ఫోటో మేసేజింగ్‌యాప్‌ స్నాప్‌ చాట్‌. అనతి కాలంలోనే ఇండియాలో యూజర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోగలిగింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తనదైన ముద్ర వేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.

ఫోటో మెసేజింగ్‌ యాప్‌ స్నాప్‌చాట్‌ వినియోగదార్ల సంఖ్య 10 కోట్లు దాటిందని ఆ కంపెనీ సీఈవో ఇవాన్‌ స్పైగల్‌ తెలిపారు. ‘ ఇండియాలో యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేశామని తెలిపారు. ముఖ్యంగా లోకల్‌ ఫీల్‌ తెచ్చేందుకు కంటెంట్‌ కోసం భారీగా ఖర్చు చేశామన్నారు. ఆ ప్రయమ్నం ఫలించిందని. అందువల్లే ఈ ఏడాది ఆరంభంలో ఆరు కోట్లు ఉన్న యూజర్ల సంఖ్య ప్రస్తుతం పది కోట్లకు చేరింది’ అని వివరించాడు. స్నాప్‌చాట్‌ వేదికపై ప్రకటనదార్ల సంఖ్య 2020లో 70% పెరిగిందని కూడా ఇవన్‌ స్పైగల్‌ వెల్లడించారు.   

ఇండియాలో యూజర్‌ బేస్‌ పెరగడంతో స్నాప్‌చాట్‌ని వ్యాపార భాగస్వామిగా ఎంచుకునేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఆగ్యుమెంటెంట్‌ రియాల్టీని ఉపయోగిస్తూ షాపింగ్‌లో కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌చాట్‌లు సంయుక్తంగా పని చేస్తున్నాయి. అంతేకాదు జోమాటో, షుగర్‌ కాస్మోటిక్స్‌, మైగ్లామ్‌ కంపెనీలు కూడా స్నాప్‌చాట్‌తో కలిసి పని చేస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు