ఫేస్‌బుక్‌ డౌన్.. వారికి మాత్రం పండుగే పండుగ!

6 Oct, 2021 14:58 IST|Sakshi

రెండు రోజుల క్రితం ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమయంలో అమెరికాకు చెందిన ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్‌ వినియోగం ఒకేసారి 23 శాతం పెరిగింది. ఫేస్‌బుక్‌లో ఈ అంతరాయం కారణంగా సుమారు 2.7 బిలియన్ వినియోగదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని యాప్స్ లో అంతరాయం కలగడంతో సిగ్నల్, టెలిగ్రామ్, టిక్ టాక్, ట్విట్టర్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్లను యూజర్లు ఎక్కువగా వినియోగించారు. దీంతో ఇతర యాప్స్ వినియోగం భారీగా పెరిగింది.

టెలిగ్రామ్ వినియోగం 18 శాతం, సిగ్నల్ యాప్ వినియోగం 15 శాతం పెరిగినట్లు ఆ సంస్థలు నివేదించాయి. అక్టోబర్ 4(సోమవారం) ఫేస్‌బుక్‌లో అంతరాయం ఏర్పడిన సమయంలో 70 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ ను వినియోగించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ సేవలు అన్ని గంటల సేపు నిలిచిపోవడానికి అంతర్గతంగా నెలకొన్న కమ్యూనికేషన్‌ టూల్స్‌లో లోపాలే కారణమని వెల్లడైంది. కన్ఫిగరేషన్‌ మార్పుల్లో తలెత్తిన లోపాల వల్ల సర్వీసులకి అంతరాయం ఏర్పడింది  ఆ సంస్థ ఇంజినీర్ల బృందం తన బ్లాగ్‌లో వెల్లడించింది. (చదవండి: గూగుల్‌ నుంచి ‘స్నోకోన్‌’, దాని వెనుక చరిత్ర ఏంటో తెలుసా?)

మరిన్ని వార్తలు