సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుకు, డాక్టర్లకు కేంద్రం షాక్‌!

22 Jun, 2022 09:38 IST|Sakshi

సోషల్‌ మీడియా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుకు, డాక్టర్లకు కేంద్రం ఊహించని షాక్‌ ఇవ్వనుంది. జూన్‌1 నుంచి ఇన్‌ఫ్లూయెన్సర్లలకు సంస్థలు అందించే ఫ్రీగిఫ్ట్ పై, అలాగే డాక్టర్లకు ఫార్మాస్యూటికల్స్ ఫ్రీగా ఇచ్చే మెడిసిన్‌పై ట్యాక్స్‌  కట్టాల్సి ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

సాధారణంగా ఏదైనా సంస్థ ప్రొడక్ట్‌ ప్రమోషన్‌ కోసం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలను ఆశ్రయిస్తాయి. ఇన్‌ఫ్లూయెన్సర్లు సదరు సంస్థ ప్రొడక్ట్‌ సేల్‌ చేయమని ఫాలోవర్లకు సలహా ఇస్తారు. వారి సలహా మేరకు కొనుగోలు దారులు ఆ ప్రొడక్ట్‌లపై భారీ ఎత్తున ఖర్చు చేస్తారు. దీంతో ప్రొడక్ట్‌ సేల్స్‌ పెరుగుతాయి. అలా కొన్ని కంపెనీలు ప్రొడక్ట్‌లను ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఉచితంగా అందిస్తాయి. ఆ ఉచితాలపై జులై 1నుంచి కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సీబీడీటీ సంస్థ 10శాతం ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు డాక్టర్ల నుంచి ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు నివేదికలు హైలెట్‌ చేశాయి.  

వాటిపై నో ట్యాక్స్‌ 
ఒకవేళ సంస్థలు ప్రమోషన్‌ (పబ్లిసిటీ) కోసం ఇచ్చిన కార్‌, మొబైల్‌, ఔట్‌ ఫిట్‌ (దుస్తులు) కాస్మోటిక్స్‌ వంటి ప్రొడక్ట్‌లను ఇన్‌ఫ్లూయెన్సర్లు తిరిగి ఇచ్చేస్తే వాటిపై ట్యాక్స్‌ ఉండదని సెక్షన్‌ 194 ఆర్‌ టీడీఎస్‌ నిబంధనలు చెబుతున్నాయని సీబీడీటీ తెలిపింది. అదే ఫ్రీగా పొందే కార్లు, టీవీలు, మొబైల్ ఫోన్‌లు, ఫ్రీ టిక్కెట్‌లు, విదేశీ పర్యటనలు, బిజినెస్‌ కోసం అందించే ఇతర ప్రోత్సహకాలపై టీడీఎస్‌ వర్తించనుంది. 

డాక్టర్లు సైతం
ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి  ఫార్మాస్యూటికల్స్ ఫ్రీగా కొన్ని మెడిసిన్‌లను అందిస్తాయి. వాటిపై టీడీఎస్‌ కట్టాల్సి ఉంటుంది. అయితే ఆ ఫ్రీ మెడిసిన్‌లు ఆస్పత్రికి ప్రయోజనం అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆదాయపు పన్ను మినహాయిస్తుంది. అందుకే డాక్టర్లు టీడీఎస్‌ నుంచి ఉపశమనం పొందాలంటే సదరు ఆస్పత్రి యాజమాన్యం ట్యాక్స్‌ రిటర్న్‌ అందించాల్సి ఉంటుంది.అలా చేస్తే చట్టంలోని సెక్షన్ 194ఆర్‌ కింద మినహాయించబడిన పన్ను క్రెడిట్‌ను పొందవచ్చని సీబీడీటీ పేర్కొంది. దీంతో డాక్టర్లు టీడీఎస్‌ కట్టాల్సిన అవసరం ఉండదు.

చదవండి👉 ఈ యూట్యూబర్ల నెలవారీ సంపాదన తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!

మరిన్ని వార్తలు