ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంకు భారీ పెట్టుబడి!

4 Jun, 2021 13:00 IST|Sakshi

 ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ  పె ట్టుబడులు  పెట్టనున్న సాఫ్ట్‌ బ్యాంకు

700 మిలియన్ డాలర్లుపెట్టుబడికి చర్చలు

సాక్షి,ముంబై: ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ పెట్టుబడులపై జపాన్‌ దిగ్గజ బ్యాంకు సాఫ్ట్‌బ్యాంక్ మరోసారి దృష్టిపెట్టింది. 700 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ ఫ్లిప్‌కార్ట్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత ఈ పెట్టుబడి సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2 కు సంబంధించి 1.2-1.5 బిలియన్ల డాలర్ల నిధుల్లో భాగం. దీంతో మూడేళ్ల క్రితం తన మొత్తం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించిన ఫ్లిప్‌కార్ట్ విలువ సుమారు 28 బిలియన్ల డాలర్లకు చేరనుంది.  మరో రెండు మూడు నెలలో ఈ డీల్‌  పూర్తయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు ప్రోసస్ వెంచర్స్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఇతరపెట్టుబడిదారులు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో తమ వాటాలను పెంచుకోనున్నాయి.  ఫలితంగా  మొత్తం  ఫ్లిప్‌కార్ట్  విలువ 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా

లైవ్‌మింట్‌ నివేదిక ప్రకారం ప్రోసస్ వెంచర్స్‌. నాస్పెర్స్,  విభాగం కూడా తమ వాటాను పెంచుకునేందుకు యోచిస్తున్నాయి.  రానున్న12-18 నెలల్లో  లిస్టింగ్‌కు  రనున్న తరుణంలో అంతకుముందే ఈ లావాదేవీలు పూర్తికానున్నాయని భావిస్తున్నారు. అలాగే ఐపీఓకు ముందు మరోసారి నిధులు సమీకరణకు వెళ్లే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ కోసంజేపీ మోర్గాన్ గోల్డ్‌మన్ సాచ్స్ లావాదేవీలను నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, దాని డిజిటల్ చెల్లింపుల విభాగం ఫోన్‌పే 2022 నాటికి యుఎస్‌లో ఐపీవోకి వెళ్లాలని  భావిస్తోంది.. ఆ సమయానికి  సుమారు 40 బిలియన్ల నికర విలువను సాధించాలని ఫ్లిప్‌కార్ట్‌  భావిస్తోంది. 

ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడుల నిమిత్తం సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీ, కెనడియన్ పెన్షన్ ఫండ్ సీపీపీఐబీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయా సంస్థలు అధకారికంగా స్పందించాల్సి ఉంది. అయితే  ఫ్లిప్‌కార్ట్‌కు సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు కొత్తేమీ కాదు. కానీ  మే 2018లో  తన పెట్టుబడులను సాఫ్ట్‌ బ్యాంకు ఉపసంహరించుకుంది.  వాల్‌మార్ట్  ఆధీనంలోకి ఒక సంవత్సరంలోనే సుమారు 20 శాతం వాటాను విక్రయించింది. ఇప్పుడు, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్-2లో భారతదేశంలో దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇది గత నెలలో స్విగ్గీలో 1 బిలియన్ డాలర్లు, బ్యాంకింగ్ టెక్ సంస్థ జీటాలో పెట్టుబడులు పెట్టడానికి  సంసిద్దతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

చదవండి : దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు! 
కరోనా సెకండ్‌ వేవ్‌ : ఆర్‌బీఐ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు