బంపర్‌ ఆఫర్‌..! సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌కు రిజైన్‌ చేస్తే రూ.4లక్షలిస్తాం!!

11 Jan, 2022 14:19 IST|Sakshi

ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేసేందుకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. సంబంధిత సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి జాబ్‌కు రిజైన్‌ చేస్తే సమారు $2,500 నుంచి 5వేల డాలర్లు చెల్లిస్తామని ఆఫర్‌ ఇస్తుంది. కానీ ఉద్యోగులు ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల్ని ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. కొత్త ఉద్యోగుల నియామకం లేదా, ఆల్రెడీ ఉన్న ఉద్యోగులు ఆ సంస్థను వదిలి వెళ్లకుండా ఉండేలా చూడడం ఆయా సంస్థలకు కత్తిమీద సాములాగా మారింది.అందుకే ఉద్యోగుల భద్రతా, శాలరీను పెంచడం, బోనస్‌ ఇవ్వడంతో పాటు వారి పిల్లల ఎడ్యుకేషన్‌ కు సంబంధించి అనేక ప్రయోజనాల్ని అందిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా కొత్త టాలెంట్‌ కోసం అరిజోనాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ 'ట్రైన్యువల్' సీఈఓ క్రిస్ రోంజియో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి జాబ్‌కు రిజైన్‌ చేస్తే సమారు $2,500 (సుమారు.రూ.2లక్షలు )చెల్లిస్తామని ఆఫర్‌ ఇచ్చారు.

రోంజియో 2020,మే' లో పే-టు-క్విట్ పాలసీని ప్రారంభించారు. ఈ పాలసీలో భాగంగా ఉద్యోగులు తమ జాబ్‌కు రిజైన్‌ చేసిన రెండు వారాల్లో కంపెనీ ప్రకటించిన రూ.2కోట్లను ఉద్యోగులకు అందిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా కొత్త ఉద్యోగుల నియమాకం సులభం అవ్వడంతో పాటు, ఉద్యోగం నుంచి రిజైన్‌ చేస్తున్న ఉద్యోగులు ఎలాంటి ఆర్ధిక సమస్యలు ఉండొద్దని భావించారు. 

తాజాగా పే-టు- క్విట్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను రూ.2లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచారు. ఇప్పటికీ ఆ ఆఫర్‌ను తిరస్కరించే ఉద్యోగులకు అదనపు 'బెన్‌ ఫిట్స్‌' ను కోల్పోతారని రోంజియో వెల్లించారు. ఈ సందర్భంగా రోంజియో మాట్లాడుతూ..తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు సంవత్సరానికి $80,000, $100,000 సంపాదిస్తున్నట్లయితే, $2,500 చాలా తక్కువగా ఉండొచ్చు.లేదంటే వేరే సంస్థకు వెళ్లేందుకు ఇష్టపడకపోవచ్చు. అందుకే ఆఫర్‌ను $2,500 నుంచి $5000('సుమారు రూ.4లక్షలు) పెంచాం. అయినా జాబ్‌కు రిజైన్‌ చేయలేదంటే వారికి అదనపు బెన్‌ఫిట్స్‌' ను అందించమని చెప్పారు.

చదవండి: ఉద్యోగులకు షాక్‌, టీకా వేయించుకుంటారా..ఉద్యోగం నుంచి తొలగించమంటారా! 

మరిన్ని వార్తలు