సోలార్‌ హెడ్‌ల్యాంప్‌ ఉపయోగాలు ఎన్నో.. ఎన్నెన్నో

9 Oct, 2022 11:06 IST|Sakshi

హెడ్‌ల్యాంప్‌లు కొత్తవేమీ కాదు గాని, సౌరశక్తితో పనిచేసే హెడ్‌ల్యాంప్‌లు మాత్రం కొత్తే! అమెరికాకు చెందిన సోలార్‌ వస్తువుల తయారీ సంస్థ ఎంపవర్డ్‌ ‘లూసిబీమ్‌’ పేరుతో సౌరశక్తితో పనిచేసే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

ఇది హెడ్‌ల్యాంప్‌గానే కాదు, ఫ్లాష్‌లైట్‌గా కూడా ఉపయోగపడుతుంది. క్యాంపులు, పిక్నిక్‌లు వెళ్లేటప్పుడు, చీకటి ప్రదేశాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. చుట్టూ చీకటి ఉన్నా, దీనికి ఉండే ఎలాస్టిక్‌ హెడ్‌బ్యాండ్‌ను తలకు తగిలించుకుని, దీపిపి ఆన్‌ చేసుకుంటే చాలు. దీని నుంచి వెలువడే వెలుతురులో హాయిగా పుస్తకాలు చదువుకోవచ్చు. 

దీని నుంచి 300 ల్యూమెన్స్‌ వెలుతురు నిరంతరాయంగా వెలువడుతుంది. దీనికి ఉన్న యూఎస్‌బీ పోర్ట్‌తో సెల్‌ఫోన్లు వంటి ఎలక్ట్రిక్‌ పరికరాలను కూడా చార్జ్‌ చేసుకోవచ్చు. దీని ధర 35.68 డాలర్లు (రూ.2,920) మాత్రమే!  

మరిన్ని వార్తలు