ఈ టెంట్‌ ఉంటే అడవిలోనైనా హాయే! ప్రత్యేకతలు ఏంటంటే..

19 Feb, 2023 13:50 IST|Sakshi

TECH టమారం

అడవుల్లోకి వెళ్లి అక్కడే టెంట్లు వేసుకుని గడపాలనే సరదా చాలామందికే ఉంటుంది. అడవుల్లో టెంట్లు వేసుకోవడం చాలా కష్టమైన పని. అడవుల్లో విద్యుత్తు సరఫరా ఉండదు. మరి టెంట్లలో మకాం చేసేవారి పరిస్థితి ఊహించుకోవాల్సిందే! ఇదివరకటి కాలంలో లాంతర్లు, విసనకర్రలు తీసుకువెళ్లేవారు. ఇటీవలి కాలంలో పోర్టబుల్‌ బ్యాటరీలు, రీచార్జబుల్‌ లైట్లు, ఫ్యాన్లు వంటివి తీసుకువెళుతున్నారు.

ఇంత ఇబ్బంది లేకుండా, టెంట్లకు నేరుగా విద్యుత్తు సరఫరా ఉంటే పరిస్థితి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కదూ! ఇదే ఆలోచనతో అమెరికాకు చెందిన సోలార్‌ పరికరాల తయారీ సంస్థ ‘జాకెరీ’ ఏకంగా సోలార్‌ టెంట్‌ను రూపొందించింది. టెంట్‌ పైభాగంలో ఉన్న సోలార్‌ ప్యానెల్స్‌ సౌరశక్తిని గ్రహించి, ఇందులోని ‘ఫొటో వోల్టాయిక్‌ సోలార్‌ సెల్స్‌’లో 1200 వాట్ల విద్యుత్తును నిక్షిప్తం చేస్తాయి.

ఈ విద్యుత్తుతో టెంట్‌లో లైట్లు, ఫ్యాన్లు వంటివి ఇంట్లో మాదిరిగానే వాడుకోవచ్చు. ఈ సోలార్‌ టెంట్‌లు నలుగురైదుగురు వరకు బస చేయడానికి అనువుగా రూపొందించారు. ఇటీవల జరిగిన కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌)–2023 ప్రదర్శనలో దీనిని ప్రదర్శించారు. ఇది ఇంకా మార్కెట్‌లోకి రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: వెచ్చదనమే కాదు.. వేసవిలో చల్లగానూ ఉంచే దుప్పటి గురించి తెలుసా?)

మరిన్ని వార్తలు