కాగ్నిజెంట్‌లో కీలక స్థానంలో సోమా పాండే

14 Dec, 2021 18:12 IST|Sakshi

మల్టీ నేషనల్‌ ఐటీ కంపెనీ కాంగ్నిజెంట్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ గ్లోబల్‌ హెడ్‌గా భారతీయురాలైన సోమా పాండేను నియమిస్తున్నట్టు మంగళవారం కాగ్నిజెంట్‌ ప్రకటించింది. హుమన్‌ రిసోర్స్‌ విభాగంలో గడిచిన పాతికేళ్లుగా సోమా పాండే వేర్వేరు సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 

కాగ్నిజెంట్‌ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 3.10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు ఇండియాలో పని చేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ అత్యధిక నియమకాలు చేపట్టిన సంస్థగా కాగ్నిజెంట్‌ ముందు వరుసలో ఉంది. ఈ క్రమంలో ఇండియన్‌ విమన్‌ సోమా పాండేకి టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ గ్లోబల్‌ హెడ్‌ బాధ్యతలను కాగ్నిజెంట్‌ అప్పగించింది.

ఇప్పటి వరకు టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ హెడా పని చేసిన సురేశ్‌ బేతవందు ఇటీవల కాగ్నిజెంట్‌కి రాజీనామా చేసి మైండ్‌ ట్రీ సంస్థలో చీఫ్‌ పీపుల్స్‌ ఆఫీసర్‌గా చేరారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని సోమా పాండేతో కాగ్నిజెంట్‌ భర్తీ చేసింది. ఇంతకు ముందు ఫస్ట్‌సోర్స్‌ సోల్యూషన్స్‌ సంస్థలో గత ఐదేళ్లుగా సీహెచ్‌ఆర్‌వోగా ఆమె విధులు నిర్వర్తించారు.

అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా కాగ్నిజెంట్‌ ప్రస్థానం ప్రారంభమైనా.. ప్రస్తుతం ఎక్కువ వర్క్‌ఫోర్స్‌ అంతా ఇండియాలోనే ఉంది. ఈ సంస్థలో దాదాపు రెండు లక్షల మంది ఇండియన్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ పని చేస్తున్నారు. ఈ తరుణంలో నియమకాలకు చేపట్టే హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌కి మరో భారతీయురాలు హెడ్‌గా రావడం మంచి పరిణామమే అని ఈ సెక్టార్‌కి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు