ఏపీ హస్త కళలకు అంతర్జాతీయ మార్కెట్‌? ఐహెచ్‌జీఎఫ్‌లో ప్రదర్శన

29 Oct, 2021 10:58 IST|Sakshi

ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియన్‌ హ్యాండీక్రాఫ్ట్‌ గిఫ్ట్‌ ఫెయిర్‌ (ఐహెచ్‌జీఎఫ్‌) ఎగ్జిబిషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏటికొప్పాక చెక్కబొమ్మలు, నర్సాపూర్‌ క్రోచెట్‌లెస్‌ డ్రెస్‌లు ప్రదర్శిస్తున్నారు. దేశీయ హస్తకళా ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తోన్న కళరా సంస్థ రిలయన్స్‌ భాగస్వామ్యంతో ఈ ఉత్పత​‍్తులకు ఈ ప్రదర్శనలో చోటు కల్పించింది. నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లోని నోయిడాలో ప్రారంభమైన ఈ 52వ ఐహెచ్‌జీఎఫ్‌ ఎగ్జిబిషన్‌ అక్టోబరు 31 వరకు కొనసాగుతుంది. హస్తకళాకారులకి, డీలర్లను అనుసంధానం చేయడంలో కళారా కీలక పాత్ర పోషిస్తోంది, 

కళారా ఆధ్వర్యంలో ఇప్పటికే ఇండియాకు చెందిన అనేక ఉత్పత్తులకు అంతర్జతీయ స్థాయిలో మార్కెట్‌ ఏర్పడింది. ఇందులో చిన్నామలైకి చెందిన కిచెన్‌ చేనేత టవల్స్‌, ఒడిషా, బెంగాల్‌లకు చెందిన గ్రాస్‌ప్లేస్‌మెంట్స్‌, మణిపూర్‌కి చెందిన లంగ్‌పీ కుండలు ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న హస్తకళలకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు మార్కెట్‌ లభించింది. అదే పద్దతిలో ఏటికొప్పాక కొయ్యబొమ్మలు, నర్సాపూర్‌ క్రోచెట్‌లెస్‌ దుస్తులకు మార్కెట్‌ వస్తుందనే ఆశాభావాన్ని కళరా వ్యక్తం చేసింది

మరిన్ని వార్తలు