మార్కెట్లోకి సోనాలికా పబ్లికేషన్స్‌ కొత్త బుక్‌ సిరీస్‌

15 Mar, 2022 08:13 IST|Sakshi

ముంబై: సోనాలికా పబ్లికేషన్స్‌ ‘‘టేల్స్‌ ఆఫ్‌ డిఫరెంట్‌ టెయిల్స్‌’’ పేరుతో కొత్త బుక్‌ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అనంత్‌ మిట్టల్, అతని తల్లి సురభి మిట్టల్‌ రచించిన ఈ పుస్తకంలోని కథలు మన సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలకు అద్దం పట్టేలా ఉన్నాయి. చిన్నారులను ఆకట్టుకునేలా కథనంలో పాత్రలతో పాటు జంతువులను కూ డా భాగం చేశారు. సోనాలికా గ్రూప్‌ సీఎస్‌ఆర్‌ డైరెక్టర్, సహ రచయిత సురభి మిట్టల్‌ మాట్లా డుతూ, పుస్తకంలో విలువలు, స్ఫూర్తి వంటి గొప్ప అంశాలను చర్చించామన్నారు. 

మరిన్ని వార్తలు