ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ కంపెనీ సోనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సోనీ ఎక్స్‌పీరియా సిరీస్‌లో భాగంగా సోనీ ఎక్స్‌పీరియా ప్రో-1 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో సినిమాటోగ్రఫీ మోడ్‌లో వీడియోలను షూట్ చేయవచ్చును.ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్‌తో 1-అంగుళాల ఎక్స్మోర్ ఆర్ఎస్ సీఎమ్ఒఎస్ సెన్సార్‌ను సోనీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కు కుడి వైపున షట్టర్ బటన్‌ను కూడా అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరాలో జీస్ టెస్సార్ కాలిబ్రేటెడ్ ఆప్టిక్స్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు అదనంగా వ్లాగ్ మానిటర్‌ను కూడా లాంచ్ చేసింది.
సోనీ ఎక్స్‌పీరియా ప్రో-1 12జీబీ ర్యామ్‌తో రానుంది. 30వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 1.35 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వ్లాగ్ మానిటర్ ధర రూ. 15 వేలు. డిసెంబర్ నుంచి నుంచి సోనీ రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
సోనీ ఎక్స్‌పీరియా ఫీచర్స్..!