Smartphone Zombies: ఆర్టిఫిషియల్‌ ఐ... ప్రమాదాన్ని ముందే చెప్పేస్తుంది!

7 Jun, 2021 09:26 IST|Sakshi

స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్‌

రోబోటిక్ సాయంతో మ‌నిషికి మూడో క‌న్ను

రోడ్డు ప్ర‌మాదాల్ని నివారించే థ‌ర్డ్ ఐ

సియోల్‌ : భవిష్యత్తు ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, రోబోటిక్‌ రంగాలదేనని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఫ్యూచర్‌లో ఎన్నో అద్భుతాలు చేయగల సత్తా రోబోటిక్స్‌, ఏఐకి ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ రెండింటి కలయికలో ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి.. ఆ పరంపరలో వచ్చిన మరొక ఆవిష్కరణ థర్డ్‌ ఐ. మన కంటే ఎక్కువగా మన కదలికలను గమనిస్తూ .. ప్రమాదాలు వచ్చినప్పుడు హెచ్చరించి కాపాడే కృతిమ కన్ను.. సాంకేతిక త్రినేత్రం. ఇంతకీ దీని అవసరం ఎందుకు వచ్చింది... ఇది ఎలా పుట్టుకు వచ్చింది....?!

స్మార్ట్ ఫోన్ జాంబీస్‌!. కొంత‌మంది పాదాచారులు, లేదంటే వాహ‌న‌దారులు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు లోకాన్ని మ‌రిచిపోతుంటారు. చుట్టుప‌క్క‌ల ఏం జ‌రుగుతున్నా ప‌ట్టించుకోరు.అలాంటి వారి కోసం టెక్ నిపుణులు ప్ర‌త్యామ్నాయాలు వెతుకుతున్నారు. తాజాగా ద‌క్షిణ కొరియాకు చెందిన పేంగ్ మిన్ వూక్' రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఇంపీరియల్ కాలేజీలో ఇన్నోవేషన్ డిజైన్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. స్మార్ట్ వినియోగ‌దారులు రోడ్డు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. అలాంటి వారి ప్రాణాల్ని ర‌క్షించేందుకు  రోబోటిక్ టెక్నాల‌జీని ఉప‌యోగించి మ‌నిషి చూసేందుకు మూడో  క‌న్నును త‌యారు చేశాడు. 

"ఫోనో సేపియన్స్ అని పిలిచే థ‌ర్డ్ ఐను నుదిటిపై పెట్టుకునేలా డిజైన్ చేశాడు. ఈ 'థ‌ర్డ్ ఐ' రోడ్డు ప్ర‌యాణాల్లో, లేదంటే న‌డిచే స‌మ‌యంలో ఫోన్ బ్రౌజ్ చేసే స‌మ‌యంలో అలెర్ట్ చేస్తోంది. ప‌రిస‌రాల్ని గ‌మ‌నించ‌డం లేద‌ని అనిపిస్తే సిగ్న‌ల్ ఇస్తోంది. ఒకటి నుండి రెండు మీటర్ల లోపు రోబోయే ప్ర‌మాదాల్ని హెచ్చ‌రిస్తూ బీప్ సౌండ్ చేస్తోంది. ప్ర‌స్తుతం పేంగ్ మిన్ వూక్ త‌యారు చేసిన ఈ థ‌ర్డ్ ఐ సియోల్ న‌గ‌రంలో చ‌ర్చాంశ‌నీయంగా మారింది. ఇప్పుడు ఈ ఫోనో సేపియ‌న్స్ కు కెమెరా మాడ్యూల్తో  లింక్డ్ మొబైల్ ఫోన్ యాప్ ను డెవ‌ల‌ప్ చేయాలని యోచిస్తున్న‌ట్లు రాయిట‌ర్స్ కు తెలిపాడు.

"అతను నుదిటిపై కన్ను ఉన్న గ్రహాంతరవాసిలా కనిపిస్తున్నాడు అని సియోల్ నివాసి లీ ఓక్-జో చెప్పారు. "ఈ రోజుల్లో చాలా మంది యువకులు తమ మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి వారికి ఇది మంచిది అనే అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.  "ఇది చాలా బాగుంది . అంతేకాదు ఆస‌క్తిక‌రంగా కూడా ఉంది" అని 23 ఏళ్ల షిన్ జే-ఇక్ అన్నాడు. వీధుల్లో వెళ్లే స‌మ‌యంలో ప‌రిస‌రాల్ని మ‌రిచిపోతాం. ఈ థ‌ర్డ్ ఐ తో చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాల‌తో సంబంధం లేదు.     ఇప్పుడు దీని అవ‌స‌రం నాకు లేదు. కాని పెంగ్ విక్ర‌యిస్తే ఖ‌చ్చితంగా కొనుక్కుంటాన‌ని చెప్పాడు.  

చ‌ద‌వండి : సింపుల్ ట్రిక్, వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడొచ్చు
 

మరిన్ని వార్తలు