'జీతాలిచ్చే వాళ్లపై జోకులేస్తే ఇలాగే ఉంటది', ఎలన్‌ మస్క్‌కు భారీ ఝులక్‌!

19 Jun, 2022 12:52 IST|Sakshi

టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌కు ఝలక్‌ ఇచ్చేలా ఉద్యోగులు తమని అక్రమంగా విధుల నుంచి తొలగించడంపై ఉద్యోగులు లేబర్‌ కోర్ట్‌ను ఆశ్రయించుకోవచ్చంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే టెస్లా సంస్థ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

ఇటీవల టెస్లా ఉద్యోగులు ఆ సంస్థ తీరును, సీఈవో ఎలన్‌ మస్క్‌ను విమర్శిస్తూ ఉద్యోగులు ఇంటర్నల్‌ చాట్‌ సిస్టం (ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్‌ వ్యవస్థ)లో దుమ్మెత్తి పోశారు. బహిరంగంగా ఓపెన్‌ లెటర్‌ను విడుదల చేశారు. ఆ లెటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్‌ ఉద్యోగుల్ని (ఎంత మంది అనేది స్పష్టత లేదు) తొలగించారు. 

ఈ తొలగింపుతో ఉద్యోగులు మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్లా ఉద్యోగుల పట్ల ఆయన వ‍్యవహార శైలి సరిగ్గా లేదని మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో టెస్లా తొలగించిన ఉద్యోగులు నేషనల్‌ లేబర్‌ రిలేషన్‌ బోర్డ్‌ (ఎన్‌ఎల్‌ఆర్బీ)లో పిటిషన్‌ దాఖలు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయంపై న్యాయవ్యవస్థకు చెందిన నిపుణులు స్పందిస్తున్నారు.  

ఎన్‌ఎల్‌ఆర్బీలో టెస్లాకు వ్యతిరేకంగా ఉద్యోగులు పిటిషన్‌ దాఖలు ఆ సంస్థకు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస‍్తుంది. లేబర్‌ చట్టాన్ని ఉల్లంఘించారని అపవాదుతో పాటు తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడం, వారికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.ఇదే అంశంపై సీటెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ షార్లెట్ గార్డెన్ మాట్లాడుతూ..కోర్ట్‌లు కేసు ఫైల్‌ అయితే టెస్లా సంస్థ ఆకస్మికంగా ఉద్యోగుల్ని ఎందుకు తొలగించిందో చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

అలాంటిది ఏం లేదు!
మస్క్‌ను విమర్శించినందుకే ఉద్యోగుల్ని తొలగించారని వస్తున్న ఆరోపణలపై టెస్లా ప్రెసిడెంట్‌ గ్విన్ షాట్‌వెల్ స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను విమర్శించిన ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలిపారు. ఎందుకు వారి వల్ల సంస్థకు నష్టంతో పాటు..సాధారణ ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. అందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్లిష్ట సమయాల్లో ఉద్యోగులు ఇలాంటి అనాలోచిత చర్యలు సరైనవి కావని ఉద్యోగులకు పంపిన లేఖలో గ్విన్‌ షాట్‌వెల్‌ పేర్కొన్నారు.

చదవండి👉టెస్లా ఉద్యోగులు: ఎలన్‌ మస్క్‌ నీ పద్దతి మార్చుకో..లేదంటే నీకే నష్టం!

మరిన్ని వార్తలు