స్టార్ షిప్ ఇంజిన్‌లను పరీక్షించిన స్పేస్ఎక్స్

8 Jan, 2021 16:21 IST|Sakshi

టెక్సాస్: ఎలాన్‌ మస్క్‌ కలల ప్రాజెక్ట్ స్పేస్‌ఎక్స్‌ స్టార్‌ షిప్‌ ప్రొటోటైప్ సీరియల్ నంబర్ 9(ఎస్ఎన్ 9) రాకెట్ యొక్క మూడు రాప్టర్ ఇంజిన్‌లను సంస్థ 2 సెకన్ల వరకు మండించింది. ఈ భారీ రాకెట్ ను నేడు(జనవరి 8) గగనతలంలోకి ప్రయోగించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్ యొక్క బోకా చికా టెస్టింగ్ ఫెసిలిటీ లాంచ్ ప్యాడ్‌లో ఎస్ఎన్ 9 యొక్క రాప్టర్ ఇంజిన్‌లను మండించింది. గగనతలం ప్రస్తుతం క్లియర్ గా లేదు అని సమాచారం. ఒకవేల నేడు ప్రయోగం సాధ్యం కాకపోతే శని లేదా ఆదివారాల్లో ప్రయోగించనున్నారు. గత రెండు సంవత్సరాలుగా స్పేస్‌ఎక్స్ తన స్టార్‌షిప్ డిజైన్‌ను పరీక్షిస్తుంది. గత నెలలో ప్రయోగించిన స్టార్‌ షిప్‌ ఎస్ఎన్‌8 విఫలమైన సంగతి మనకు తెలిసిందే. సుమారు 12.5 కిలోమీట‌ర్ల ఎత్తుకు ఎగిరిన ఎస్ఎన్‌8 ల్యాండింగ్ స‌మ‌యంలో పేలిపోయింది. ఈ ప్రయోగం పట్ల స్పేస్ఎక్స్ సీఈఓ ఎల‌న్ మ‌స్క్ సంతోషం వ్య‌క్తం చేశారు. ప్రయోగం విఫలమైన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు, కావాల్సిన సమాచారాన్ని సేకరించింది అని ఎల‌న్ మ‌స్క్ పేర్కొన్నాడు.(చదవండి: ప్రపంచ కుబేరుడిగా ఎలన్‌ మస్క్‌!)

మరిన్ని వార్తలు