బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌లలో 40 శాతం మహిళలే.. స్పెయిన్‌ కీలక నిర్ణయం

7 Mar, 2023 10:30 IST|Sakshi

ఒక దేశ పురోగతిని ప్రభావితం చేసే అంశాల్లో లింగ సమానత్వం ముఖ్యమైంది. మానవ వనరుల్లో సగభాగమైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న దేశాలు ఆర్థికంగానే కాకుండా అన్నీ రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. లింగ వివక్ష కనబరుస్తున్న దేశాలు చతికిలపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో స‍్పెయిన్‌ దేశంలో లింగ సమానత్వంలో మరో అడుగు ముందుకు వేసింది. కంపెనీ బోర్డ్‌లలో మహిళల నియామకంపై కొత్త చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఫార్చ్యూన్‌ నివేదిక తెలిపింది. 

స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ వివరాల మేరకు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు స్పెయిన్‌ అధికార పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌లలో మహిళల ప్రాధాన్యతపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని సాంచెజ్‌ తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 7న జరిగే కేబినెట్‌ మీటింగ్‌లో కంపెనీ బోర్డ్‌లలో 40 శాతం మహిళలు ప్రాతినిథ్యం వహించేలా  కొత్త చట్టం అమలు చేసేందుకు కేబినేట్‌ సమావేశంలోని సభ్యులు ఆమోదం తెలపనున్నారని చెప్పారు. 

ఈ చట్టం ప్రకారం.. చట్టం ప్రకారం 250 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, 50 మిలియన్ యూరోలు ($53 మిలియన్లు) వార్షిక టర్నోవర్ ఉన్న ప్రతి లిస్టెడ్ సంస్థ తప్పనిసరిగా 40 శాతం మహిళలు బోర్డ్‌ ఆఫ్‌ డైరక్టర్లగా నియమించాలని స్పష్టం చేశారు. ఇక తమ ప్రభుత్వం స్త్రీవాదానికి అనుకూలంగా మాత్రమే కాకుండా, మొత్తం స్పానిష్ సమాజానికి ప్రభుత్వం  అనుకూలంగా ఉంది అని ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ అన్నారు.

మరిన్ని వార్తలు