ఆదాయం పుంజుకున్నా.. స్పైస్‌జెట్‌ నష్టాలు పెరిగాయ్‌!

15 Nov, 2022 06:56 IST|Sakshi

న్యూఢిల్లీ:ప్రయివేట్‌ రంగ విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో దాదాపు రూ. 838 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఫారెక్స్‌ నష్టాలను మినహాయిస్తే రూ. 578 కోట్ల నష్టం నమోదైంది. ఇంధన ధరల పెరుగుదల, రూపాయి పతనం ప్రభావం చూపాయి.

గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 562 కోట్ల నష్టాలు ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,539 కోట్ల నుంచి 2,105 కోట్లకు పుంజుకుంది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 2,100 కోట్ల నుంచి రూ. 2,943 కోట్లకు ఎగశాయి. ఇదే కాలంలో కార్గో అనుబంధ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ రూ. 206 కోట్ల ఆదాయం, రూ. 21 కోట్ల నికర లాభం ఆర్జించడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో స్పైస్‌జెట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.5 శాతం నీరసించి రూ. 39 వద్ద ముగిసింది.

చదవండి: కేం‍ద్రం భారీ షాక్‌: పది లక్షల రేషన్‌ కార్డులు రద్దు, కారణం ఏంటంటే..

మరిన్ని వార్తలు