SpiceJet : స్పైస్‌జెట్‌ బంపర్‌ ఆఫర్‌, టికెట్ల కొనుగోలుపై ఈఎంఐ సదుపాయం

8 Nov, 2021 15:06 IST|Sakshi

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకింగ్‌, రీటైల్‌, ఈ కామర్స్‌తో పాటు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈఎంఐ సదుపాయాన్ని స్పైస్‌ జెట్‌ ఇప్పుడు విమాన ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. 

విమాన ప్రయాణికులు ఈఎంఐ సౌకర్యంతో స్పైస్ జెట్‌ ఫ్లైట్‌ టికెట్లను కొనుగోలు చేయొచ్చు. 3,6,12 నెలల పాటు వాయిదా పద్దతుల్లో వడ్డీ లేకుండా, కొనుగోలు చేసిన టికెట్ల ధర మొత్తాన్ని ఈఎంఐలో చెల్లించుకోవచ్చు.      
 
ప్రయాణికులు చేయాల్సిందల్లా ఒక్కటే 
స్పైస్‌ జెట్‌ విమాన టికెట్లకు ఈఎంఐ సదుపాయం కావాలంటే ప్రయాణికులు పాన్‌ నెంబర్‌, ఆధార్‌ కార్డ్‌, వీఐడీ వివరాల్ని నమోదు చేయాలి. వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ తో యాక్టీవ్‌ చేసుకోవాలి. వినియోగదారులు  యూపీఐ ఐడీ ద్వారా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ స్కీమ్‌ను పొందేందుకు ప్రయాణికులు ఎలాంటి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను అందించాల్సిన అవసరం లేదని స్పైస్‌ జెట్‌ పేర్కొంది. 

చదవండి:ఇకపై ఎంచక్కా..ఫ్లైట్‌ జర్నీలోనే క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు

మరిన్ని వార్తలు