ఇకపై ఎంచక్కా..ఫ్లైట్‌ జర్నీలోనే క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు

13 Aug, 2021 08:24 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బడ్జెట్‌ క్యారియర్‌ స్పైస్‌జెట్‌ దేశీయ విమానయాన రంగంలో తొలిసారిగా కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఇన్‌ఫ్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదిక అయిన స్పైస్‌స్క్రీన్‌ సహాయంతో విమానంలో ఉన్నప్పుడే ప్రయాణికులు క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు. తక్కువ చార్జీలతోపాటు 10 శాతం వరకు డిస్కౌంట్‌ కూడా ఉంటుంది. 

ప్రయాణికులు క్యాబ్‌ డిపార్చర్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అరైవల్‌ గేట్‌ వద్దే క్యాబ్‌ సిద్ధంగా ఉంటుందని స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో దిగే ప్యాసింజర్లు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. హైదరాబాద్‌సహా ఇతర ప్రధాన నగరాలకు ఈ సౌకర్యాన్ని దశలవారీగా పరిచయం చేస్తారు. క్యాబ్‌ రద్దు చేసుకుంటే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

స్పైస్‌స్క్రీన్‌ ద్వారా క్యాబ్‌ బుక్‌ చేసుకోగానే ఎస్‌ఎంఎస్, వాట్సాప్‌ ద్వారా ఓటీపీతోపాటు విమానం దిగిన వెంటనే కాల్‌ కూడా వస్తుంది. స్పైస్‌స్క్రీన్‌ను గతేడాది ఆగస్టులో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణంలో ఆన్‌బోర్డ్‌ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయి స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌ పీసీ లేదా ల్యాప్‌టాప్‌ ద్వారా వినోదాన్ని ఆస్వాదించవచ్చు. 

చదవండి : వారెవ్వా..!సరికొత్త రికార్డ్‌లను బద్దలు కొట్టిన అగ్రికల్చర్‌ బిజినెస్‌ రిజిస్ట్రేషన్లు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు