SpiceJet: భారీ నష్టాలు,సీఎఫ్‌వో గుడ్‌బై, కుప్పకూలిన షేర్లు 

1 Sep, 2022 11:32 IST|Sakshi

స్పైస్‌జెట్‌కు ఏమైంది?

15 శాతం కుప్పకూలిన షేర్లు

బెంగళూరు: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న స్పైస్‌జెట్‌కు మరోషాక్‌  తగిలింది. ఒకవైపు  భారీ స్థాయిలో ఈ త్రైమాసికంలో నష్టాలు, మరోవైపు సంస్థ సీఎఫ్‌వో రాజీనామా చేయడంతో  గురువారం నాటి మార్కెట్లో స్పైస్‌జెట్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా దాదాపు 15 శాతం కుప్పకూలాయి. ఇది ఇలా ఉండగా గురువారం ఉదయం  ఆటోపైలట్‌ స్నాగ్‌ కారణంగా  ఢిల్లీ-నాసిక్ స్పైస్‌జెట్‌ విమానాన్ని వెనక్కి మళ్లించిన ఘటన  చోటు చేసుకుంది. 

ఇదీ చదవండి: చెక్‌ బౌన్స్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇంధన ధరల భారం, దేశీయ కరెన్సీ రూపాయిక్షీణత, స్పైస్‌జెట్ లిమిటెడ్  భారీ నష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంజీవ్ తనేజా రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. షేర్లు గురువారం ఆరంభంలో 14.7 శాతం  నష్టపోయాయి. పెరుగుతున్న నష్టాలు, ఇటీవలి కాలంలో మిడ్-ఎయిర్ సంఘటనల మధ్య  సంజీవ్‌ రాజీనామా చేసినట్లు తెలిపింది. (SpiceJet: స్పైస్‌జెట్‌ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి)

కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం రూ. 789 కోట్లకు పెరిగిందని, ప్రధానంగా అధిక ఇంధన ధరలు, రూపాయి క్షీణత కారణంగా నష్టాలొచ్చాయని బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఏడాది క్రితం కాలంలో రూ. 235.3 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 458 కోట్ల నికర నష్టం వచ్చినట్టు వెల్లడించిది. అయితే సైబర్ సెక్యూరిటీ దాడి కారణంగా ఆలస్యమైందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నగదు సంక్షోభంలో  చిక్కుకున్న సంస్థ అద్దెదారులకు సకాలంలో చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతోంది, కొంతమంది తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరుసగా రెండో నెలలో కూడా జీతాలు చెల్లింపు ఆలస్యమైందని ఉద్యోగులు ఆరోపిస్తుండగా, చెల్లింపులు "గ్రేడెడ్ ఫార్మాట్"లో జరుగుతున్నాయని స్సైస్‌జెట్‌ వివరణ ఇచ్చింది.

>
మరిన్ని వార్తలు