Drone Delivery: డ్రోన్‌లతో లాజిస్టిక్స్‌ డెలివరీకి రెడీ

25 Jun, 2021 14:43 IST|Sakshi

న్యూఢిల్లీ: డ్రోన్‌ల ద్వారా వాణిజ్య సరుకు రవాణా సర్వీసులను ప్రారంభించేందుకు ప్రయోగాత్మక ప్రాజెక్టు సిద్ధమైంది. ఇందుకు వైమానిక సరుకు రవాణా(కార్లో) సంస్థ స్పైస్‌ ఎక్స్‌ప్రెస్ ఈ కామర్స్‌ లాజిస్టిక్స్‌ కంపెనీ 'డెలివరి' చేతులు కలీపాయి. మూడు నాలుగు నెలల్లో డ్రోన్‌ల డెలివరీ పైలట్‌ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఇందుకు వీలుగా రెండు సంస్థలూ అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్టు కోసం దేశీ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ స్పైస్‌ జెట్‌కు చెందిన స్పైస్‌ ఎక్స్‌ఫ్రైస్‌ కన్ఫార్షియంను పౌర విమానయాన అధీకృత సంస్థ (డీజీసీఏ) ఎంపిక చేసింది. బీవీఎల్‌వోఎస్‌ పరిధిలో డ్రోన్ల వినియోగానికి ప్రయోగాత్మక ప్రాజెక్టుకు గ్రీన్ సీగ్నల్‌ ఇచ్చింది. 

దీంతో ఎమర్జెన్సీ సర్వీసులు, సరుకు రవాణా, క్రిటికల్‌ మెడికల్‌ సర్వీసుల, పర్యావరణ పహారా తదితర కీలక వాణీజ్య సర్వీసులకు డ్రోన్ల టెక్నాలజీని వినియోగించేందుకు వీలుంటుందని నిపుణులు తెలియజేశారు. డెలివరీతో కుదిరిన ఎంవోయూ ద్వారా రెండు సంస్థలూ లబ్లి పొందనున్నట్లు స్పైస్‌ ఎక్స్‌ప్రెస్‌ సీఈవో సంజీవ్‌ గుప్తా పేర్కొన్నారు. తమకున్న సామర్జ్యాలతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టనున్నట్లు చెప్పారు. ఇది సరుకు రవాణాలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని 3-4 నెలల్లో ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 

స్పైస్‌జెట్‌తో తమకున్న దీర్షకాల సాహచర్యానికి ఈ ఒప్పందం మరింత బలాన్నివ్వనున్నట్లు డెలివరీ సీఈవో అజిత్‌ పాయ్‌ పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా లాజిస్టిక్స్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే వీలున్నదని తెలియజేశారు. ఎంవోయూలో భాగంగా భూమిపై లాజిస్టిక్స్‌ సేవలకు డెలివరీ పూర్తస్తాయిలో మద్దతివ్వనుంది. కాగా.. ఈ మే నెలలో డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల డెలివరీని చేపట్టేందుకు పార విమానయాన శాఖ తెలంగాణ ప్రభుత్వానికి షరతులతో అనుమతించిన విషయం విదితమే. కోవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొనే బాటలో వ్యాక్సిన్ల సరఫరాకు యూఏఎస్‌ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది.

చదవండి: సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్

మరిన్ని వార్తలు