ఇక రెండుగా ఈపీఎఫ్‌ ఖాతాల విభజన

2 Sep, 2021 21:20 IST|Sakshi

ప్రస్తుతం ఉన్న ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతాల్లో భారీగా నగదు జమ చేసే మొత్తాల ద్వారా సమకూరే వడ్డీపై పన్ను విధించే దిశగా కేంద్రం పీఎఫ్‌ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. ఇకపై ఏడాదికి ₹2.5 లక్షలకు మించి పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే ఆదాయంపై ప్రభుత్వం పన్ను విధించనుంది. దీనికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) నిబంధనలను జారీ చేసింది. అలాగే, రెండు వేర్వేరు ఖాతాలగా ఏర్పాటు చేయాల్సిందిగా పేర్కొంటూ నిబంధనలలో పేర్కొంది.

ఇప్పటికే ఉన్న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతాలు అన్నీ పన్ను పరిధిలోకి వచ్చే, పన్ను పరిధిలోకి రాని కంట్రిబ్యూషన్ ఖాతాలుగా విభజించనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 31న కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. తర్వాత ఆదాయపు పన్ను విభాగానికి కూడా ఈ సమాచారం అంధించింది. అధికారిక వర్గాల ప్రకారం, ఈ నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏటా ₹2.5 లక్షలకు మించి పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే ఆదాయంపై కొత్త పన్నును వసూలు చేయడానికి ఆదాయపు పన్ను నిబంధనల్లో కొత్త సెక్షన్ 9డీని చేర్చారు. పన్ను పరిధిలోకి వచ్చే వడ్డీని లెక్కించడం కొరకు, ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదేవిధంగా ఇంతక ముందు సంవత్సరాల్లో ఇప్పటికే ఉన్న ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో రెండు ప్రత్యేక ఖాతాలను నిర్వహించాల్సి ఉంటుంది. (చదవండి: రిలయన్స్‌ చేతికి జస్ట్‌ డయల్‌!)

మరిన్ని వార్తలు