మ్యూజిక్ ప్రియుల కోసం సరికొత్త టెక్నాలజీ..!!

31 Jan, 2021 14:31 IST|Sakshi

భారతదేశంలో మ్యూజిక్ ప్రియులు చాలా మంది ఉంటారు. కొందరు పనిచేసుకుంటూ పాటలు వింటే, మరికొందరు గేమ్స్ ఆడుతూ, ఇంకొందరూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ పాటలు వినడం చాలామందికి అలవాటు. అందుకే మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులకు బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు మనకు నచ్చిన పాటలను ఒక ప్లేలిస్ట్ చేసుకొని వినడమే తప్ప. ప్రత్యేకంగా మన మూడ్ను బట్టి పాటలు ప్లే అయ్యే విధానం లేదు. కానీ తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటిఫై ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ రైట్స్ పొందింది. ఈ కొత్త టెక్నాలజీ మీ ఎమోషన్ బట్టి వాయిస్ టోన్ ఆధారంగా అది పాటలను రికమెండ్ చేస్తుంది.(చదవండి: జియోపై ఎయిర్‌టెల్ పైచేయి)

గ్లోబల్ ఆడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై ఈ పేటెంట్ కోసం మొట్టమొదట ఫిబ్రవరి 2018లో దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఈ నెలలో యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ ఆఫీస్(యుఎస్పిటిఓ) ఆ పేటెంట్కు ఆమోద ముద్ర వేసింది. ఈ పేటెంట్ ప్రకారం, యూజర్లు మీరు మాట్లాడే టోన్ బట్టి ఈ సరికొత్త టెక్నాలజీ మీకు పాటలను వినిపిస్తుంది. యూజర్ల మూడ్ ను గుర్తించి వారికి ఆహ్లాదకరంగా ఉండేందుకు వీలుగా స్పాటి ఫై కంపెనీ కి కొత్త టెక్నాలజీని తీసుకు వచ్చింది. 

>
మరిన్ని వార్తలు