ఓమిక్రాన్ దెబ్బతో జీడీపీ ఢమాల్..?

6 Jan, 2022 20:06 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా కొత్త రకం వేరియంట్ ఓమిక్రాన్ పెరుగతున్న కేసుల వల్ల భారతదేశం ఈ ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం జీడీపీ రేటు తగ్గే అవకాశం ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) తెలిపింది. ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పేరుగుతుండటంతో వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి రాత్రి, వారాంతపు కర్ఫ్యూలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయి. ఇండియా రేటింగ్స్ అంచనాల ప్రకారం.. క్యూ4ఎఫ్ వై22లో జీడీపీ వృద్ధి ఇప్పుడు 5.7 శాతం(యోవై)గా ఉండనున్నట్లు తెలపింది. ఇది ఈ ఏజెన్సీ మునుపటి అంచనా 6.1 శాతం కంటే 40 బేసిస్ పాయింట్లు తక్కువ.

"2022 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ది రేటును తగ్గిస్తూ 9.3 శాతంగా పేర్కొంది. ఇది మా మునుపటి అంచనా 9.4 శాతం కంటే 10 బేస్ పాయింట్లు తక్కువ" అని ఏజెన్సీ తెలిపింది. ఓమిక్రాన్ కొత్త కేసులు గత కోవిడ్ వేరియెంట్ల కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ఎక్కువగా ప్రాణాంతకం కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫలితంగా, కోవిడ్ 1.0 & 2.0 కంటే ఇది తక్కువ విఘాతం కలిగిస్తుంది. కరోనా కేసుల వ్యాప్తిని అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూలు, లాక్ డౌన్ విధించాలని చూస్తుండటంతో ఆ ప్రభావం దేశ జీడీపీ పడుతున్నట్లు రేటింగ్స్ ఏజెన్సీ తెలిపింది.

(చదవండి: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు దారులకు శుభవార్త!)


 

>
మరిన్ని వార్తలు