మతిపోగొడుతున్న సోలార్‌ కార్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 100 కి.మీ ప్రయాణం!

12 Mar, 2023 07:31 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ కార్ల వాడుక ఇప్పుడిప్పుడే కొంత పుంజుకుంటున్న దశలోనే నెదర్లాండ్స్‌కు చెందిన ‘స్క్వాడ్‌ మొబిలిటీ’ కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి సోలార్‌ కారును రూపొందించింది.

నగరాల్లో రవాణాకు అనువుగా చిన్నగా ఉండేలా రూపొందించిన ఈ కారు పైకప్పు మీద అమర్చిన సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా విద్యుత్తు ఉత్పత్తవుతుంది.


ఈ విద్యుత్తు ద్వారా ఇంజిన్‌ను నడిపే బ్యాటరీ చార్జ్‌ అవుతుంది. ఇందులోని బ్యాటరీ ఒకసారి పూర్తిగా చార్జ్‌ అయితే, నిరాటంకంగా వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇటీవల కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో దీనిని ప్రదర్శించారు.

వచ్చే ఏడాది ఈ సోలార్‌ కారు మార్కెట్‌లోకి విడుదల కానుంది.ప్రీఆర్డర్‌పై ఈ కార్లు తయారు చేస్తున్నట్లు ‘స్క్వాడ్‌ మొబిలిటీ’ తెలిపింది. దీని ధరలు మోడల్స్, సౌకర్యాలను బట్టి 6250 డాలర్ల (రూ.5.16 లక్షలు) నుంచి మొదలవుతాయి.

మరిన్ని వార్తలు