Netflix: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..!

4 Oct, 2021 16:13 IST|Sakshi

గత వారం రోజుల నుంచి సోషల్‌ మీడియాలో స్క్విడ్‌ గేమ్‌ చూశావా..చూశావా అంటూ ఒక్కటే చర్చా..! స్క్విడ్‌గేమ్‌ నెట్‌ఫ్లిక్స్‌ను షేక్‌ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా స్క్విడ్‌ గేమ్‌కు వస్తోన్న క్రేజ్‌ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. 

నెట్‌ఫ్లిక్స్‌పై దావా...!
గత నెలలో స్క్విడ్‌ గేమ్‌ వెబ్‌సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ లాంచ్‌ అయ్యింది. ఈ సిరీస్‌కు ఓటీటీ యూజర్లు బ్రహ్మరథం పడుతున్నారు.అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్‌ రూపోందించిన స్క్విడ్‌ గేమ్‌ కంటెంట్‌పై వీక్షకుల సంఖ్య పెరగడంతో నెట్‌వర్క్ ట్రాఫిక్, మెయింటెనెన్స్ పనుల ఖర్చులను చెల్లించాలని దక్షిణ కొరియా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎస్‌కె బ్రాడ్‌బ్యాండ్ నెట్‌ఫ్లిక్స్‌పై దావా వేసినట్లు ఎస్‌కె ప్రతినిధి శుక్రవారం తెలిపారు.
చదవండి: 75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్‌ బచ్చన్‌ ఎంట్రీ...!

గతంలో నెట్‌ఫ్లిక్స్‌పై సియోల్‌ సెంట్రల్‌ డిస్ట్రిక్‌ కోర్టు నెట్‌వర్క్‌ ట్రాఫికింగ్‌ విషయంలో జరిమానాలను చెల్లించాలని పేర్కొంది. ఎస్‌కే బ్రాడ్‌బ్యాండ్‌ తన దావాలో...2018 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఎస్‌కే నెట్‌వర్క్‌ను వాడుకుంటుంది.   ఎస్‌కె బ్రాడ్‌బ్యాండ్ క్లెయిమ్‌ను రివ్యూ చేస్తామని , కస్టమర్‌లు ప్రభావితం కాకుండా ఉండేలా ఎస్‌కె బ్రాడ్‌బ్యాండ్‌తో కలిసి పనిచేసేందుకు చర్చిస్తామని నెట్‌ఫ్లిక్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

దక్షిణ కొరియా రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌ ట్రాఫికర్‌గా నెట్‌ఫ్లిక్స్‌ నిలిచింది. యూట్యూబ్‌కాకుండా అమెజాన్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌ లాంటి దిగ్గజ కంపెనీలు నెట్‌వర్క్‌ ట్రాఫికింగ్‌ ఫీజులను చెల్లిస్తున్నాయని ఎస్‌కే బ్రాడ్‌బ్యాండ్‌ పేర్కొంది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 16 వేల ఉద్యోగాలను ఇచ్చామని నెట్‌ఫ్లిక్స్‌ పేర్కొంది. అంతేకాకుండా దక్షిణకొరియాలో సుమారు రూ. 4840 కోట్లను పెట్టుబడులపెట్టామని నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది.  అమెరికాలో ఫాస్టర్‌ స్ట్రీమింగ్‌ వేగంతో నెట్‌ఫ్లిక్స్‌ సేవలను అందించినందుకుగాను కామ్‌క్యాస్ట్‌ బ్రాడ్‌బ్యాండ్‌కు ఏడు సంవత్సరాలుగా వాడుకుంటుంది. 
చదవండి:అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన టాటా మైక్రో ఎస్‌యూవీ

మరిన్ని వార్తలు