Squid Game Cryptocurrency: కేవలం 4రోజుల్లో రూ.1000 పెట్టుబడితో రూ.3.45లక్షల్ని సంపాదించారు

31 Oct, 2021 08:43 IST|Sakshi

Squid Game Cryptocurrency turn 1000 into 3 point 45 lakh in less than 100 hours.లేటెస్ట్‌ సౌత్‌ కొరియన్‌ డ్రామా 'స్క్విడ్‌ గేమ్‌' మరో సరికొత్త సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.  స్క్విడ్‌ పేరుతో ఏర్పాటైన క్రిప్టో కరెన్సీలో రూ.1000 పెట్టుబడిన పెట్టిన ఇన్వెస్టర్లు కేవలం 100 గంటల్లో  వెయ్యి రూపాయిల నుంచి రూ.3.45లక్షల్ని సంపాదించారు.

 
కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ (coinmarketcap.com)ప్రకారం..నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్న దక్షిణ కొరియా వెబ్‌ సిరీస్‌ స్క్విడ్ గేమ్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో కూడా సంచలనంగా మారింది. నెట్‌ ఫ్లిక్స్‌లో స్క్విడ్‌ గేమ్‌కు వస్తున్న ప్రజాదరణని క్యాష్‌ చేసుకునేందుకు ఓ పేరు తెలియని వ్యక్తి 'స‍్క్విడ్‌' పేరుతో సొంత క్రిప్టో కరెన్సీని ప్రారంభించారు. ఇందులో వరల్డ్‌ వైడ్‌గా సుమారు 30 వేల మంది పెట్టుబడి పెట్టారు. అయితే ఈ గేమ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ వ్యూయర్‌ షిప్‌లో నెంబర్‌ వన్‌గా కొనసాగుతుండగా..స్వ్కిడ్‌ పేరుతో ఉన్న క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ రాకెట్‌ వేగంతో దూసుకెళ్తుంది. 

స్క్విడ్‌ క్రిప్టో కరెన్సీ విలువ అక్టోబర్‌ 26న $0.01236  నుంచి అక్టోబర్‌ 29కి $4.5 కి కేవలం 100 గంటల్లో 34,285 శాతానికి ఎగబాకింది.అంటే ఇక ఈ స్వ్కిడ్‌ కరెన్సీలో  రూ.1000 పెట్టుబడి పెట్టిన మదుపర్లకు నాలుగు రోజుల్లో రూ.1000 నుంచి రూ.3,43,850 అర్జించారు. దీంతో అక్టోబర్‌ 29న ఆ క్రిప్టో  $335 మిలియన్ల మార్కెట్‌ క‍్యాపిటల్‌కు చేరినట్లైందని కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ వెల్లడించింది. 


నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తెరక్కెక్కిన స్క్విడ్‌ గేమ్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌ సిరీస్‌గా చరిత్ర సృష్టించింది.  ఇటీవల (అక్టోబర్‌ 17)ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ స‍్క్విడ్‌ గేమ్‌ గురించి తెలిపిన వివరాల ప్రకారం..సెప్టెంబర్‌ 17న నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదలై ఏకంగా 90 దేశాల్లో నెంబర్‌ 1 వెబ్‌ సిరీస్‌గా నిలిచినట్లు తెలిపింది. కేవలం 27 రోజుల్లో 111మిలియన్‌ వీక్షకులకు చేరువైందని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఇక తాజాగా  ఫోర్బ్స్‌ సెప్టెంబర్‌ 27 తేదీన విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఒక్క యూఎస్‌లో వారం రోజుల వ్యవధిలోనే టీవీ స్క్రీన్‌లపై  స్క్విడ్‌ గేమ్‌ 9 ఏపీసోడ్‌లను  ఆడియన్స్‌ 3.26 బిలియన్‌ మినిట్స్‌ వీక్షించారని, దీంతో ఈ గేమ్‌ మరో రికార్డ్‌ సృష్టించినట్లైందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. 

చదవండి: స్క్విడ్‌ గేమ్‌ క్రేజ్‌ మాములుగా లేదుగా..!

మరిన్ని వార్తలు