మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా?

7 Mar, 2022 19:26 IST|Sakshi

ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ  మాత్రమే ఆమె విధి..అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు.. ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు..వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్ని అందుబాటులోకి తెచ్చింది. అందులో  స్టాండప్‌ మిత్రా స్కీం (స్టాండప్‌ ఇండియా) ఒకటి.

చాలా మంది మహిళలు తమకాళ్లపై తాము నిలబడాలని ప్రయత్నిస్తుంటారు. అవకాశాలు లేని చోట అవకాశాల్ని క్రియేట్‌ చేసుకోవాలని భావిస్తుంటారు. కానీ ఆర్ధిక ఇబ్బందుల వల్ల వంటింటికే పరిమితం అవుతుంటారు. అలాంటి వారు ఈ స్టాండప్‌ మిత్రా స్కీం ను వినియోగించుకోవాలని కేంద్రం చెబుతోంది.  2016లో ప్రధాని మోదీ ఈ స్టాండప్‌ మిత్రా పథకాన్ని ప్రారంభించారు. ఇందులో ఎస్సీ లేదా ఎస్టీ, పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలకు రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాల్ని మంజూరు చేస్తుంది. ప్రత్యేకంగా మ్యానిఫ్యాక్చరింగ్‌, సర్వీస్‌,అగ్రి కల్చర్‌ సంబంధిత వ్యాపారలకు రుణాలిస్తుంది. 

అర్హతలు, అప్లయ్‌ చేసే విధానం
ఇందులో 18సంవత్సారాలు నిండి నలుగురికి ఉపాధి కల్పిస‍్తే చాలు. సంబంధిత  https://www.standupmitra.in/Home/SUISchemes వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లయ్‌ చేసుకోవాలి. దీంతో  కేంద్రం అర్హత ఆధారంగా వారికి బ్యాంక్‌ ఇంట్రస్ట్‌ రేట్లకే రుణాల్ని మంజూరు చేస్తుంది. అర్హతలకు అనుగుణంగా 18 నెలల నుండి 7 సంవత్సరాల వరకు రుణాల్ని చెల్లించే అవకాశం కల్పించ్చింది.  

చదవండి: 'డొనేట్-ఏ-పెన్షన్' కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

మరిన్ని వార్తలు