ఓ సీఈవో వేడుకోలు: ఆఫీస్‌కు రండయ్యా!

12 Jun, 2022 16:03 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఇంటి వద్ద నుంచి పనిచేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆఫీస్‌కు రావాలంటూ సీఈవోలు సైతం ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా స్టార్‌ బక్స్‌ సీఈవో హోవార్డ్ షుల్జ్ వ్యవహరిస్తున్నారు. బాబ్బాబు మీకు దణ్ణం పెడతా. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దు..ఆఫీస్‌కు రావాలని ఉద్యోగుల్ని ప్రాధేయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం బిజినెస్‌ వరల్డ్‌లో ఆసక్తికరంగా మారింది. 
 

వాషింగ్‌స్టన్‌లో జరిగిన న్యూయ్యార్క్‌ టైమ్స్‌  డీల్‌ బుక్‌ పాలసీ ఫోరమ్‌ కార్యక్రమంలో  స్టార్‌ బక్స్‌ సీఈవో హోవార్డ్‌ షుల్జ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఉద్యోగుల్లారా..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దు. ఆఫీస్‌కు వచ్చేయండి. వాట్‌ ఎవర్‌ యూ వాంట్‌. కావాలంటే చెప్పండి మోకాళ్లపై నిల్చుంటా, లేదంటే పుషప్స్‌ చేస్తా. కానీ మీరు మాత్రం తప్పకుండా ఆఫీస్‌కు రావాల్సిందే'నని అన్నారు.

నేను ఫెయిల్‌ అయ్యాను 
ఉద్యోగులు మాత్రం ఆఫీస్‌కు వచ్చేందుకు సుముఖంగా లేరు. నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.వారు(ఉద్యోగులు) వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఆఫీస్‌కు రావాలని అనుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఉద్యోగులు పనితీరు
స్టార్‌ బక్స్‌ సంస్థ ఉద్యోగుల జాబ్స్‌ రోల్స్‌ను బట్టి కొంత మందిని హైబ్రిడ్‌ వర్క్‌లో పనిచేయిస్తుంది. ప్రత్యేకమైన లొకేషన్‌లకు చెందిన ఉద్యోగులు మాత్రం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆఫీస్‌ వర్క్‌, హైబ్రిడ్‌ వర్క్‌ పని చేస్తున్నారు. అయితే టెస్లాతో పాటు ఇతర సంస్థల తరహాలో స్టార్‌ బక్స్‌ సైతం ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ పిలుపునిస్తుంది. 

ఉద్యోగులకు వార్నింగ్‌ 
టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీకి జై కొడుతున్నారు. ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌కు రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాదు కూడదు అంటే జీతాల్లో కోత విధిస్తామని వార్నింగ్‌  ఇచ్చారు. ఆ విషయంలో ఏ మాత్రం మొహమాటం ఉండదని ఖరాకండీగా చెప్పిన విషయం తెలిసిందే. కానీ విచిత్రంగా స్టార్‌ బక్స్‌ సీఈవో ఉద్యోగుల్ని ఆఫీస్‌కు ఈతరహా పిలుపు నివ్వడం సోషల్‌ మీడియాలో చర్చాంశనీయమైంది. 

మరిన్ని వార్తలు