గురువుని మించిన శిష్యులు, అంతరిక్షానికి మనుషుల అవయవాలు!!

10 Mar, 2022 16:51 IST|Sakshi

అమెరికాకు చెందిన ఇద్దరు కుర్రాళ్లు మనుషుల కృత్తిమ అవయవాల్ని స్పేస్‌లో స్టోర్‌ చేసేందుకు ప్రయోగాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో భాగంగా తొలిసారి వాళ్లిద్దరు తయారు చేస్తున్న ప్రత్యేక క్యాప్సుల్స్‌లో కొన్ని వస్తువుల్ని స్పేస్‌లోకి పంపి.. తిరిగి 25 రెట్లు వేగంతో భూమికి చేర్చాలని చూస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం 10 మిలియన్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంతకీ వాళ్లిద్దరూ ఎవరని అనుకుంటున్నారా? ఒకరు కాలేజీ డ్రాపౌట్‌ కాగా మరొకరు స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ శిష్యుడు.  

భూమిపై ఏదైనా నష్టం జరిగి.. మనిషి మనుగుడ కష్టమైతే ఏం చేయాలి. అందుకే అంతరిక్షంలో ఇళ్లు ఏర్పాటు చేసేలా ఎలన్‌ మస్క్‌ ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌లో ఇంటర్న్‌ షిప్‌ని మధ్యలోనే వదిలేసిన ఆయన శిష్యుడు జస్టిన్ ఫియాషెట్టి, మరో కాలేజీ డ్రాపౌట్‌ ఆస్టిన్ బ్రిగ్స్ తో కలిసి స్టార‍్టప్‌ను ప్రారంభించారు. ఆ స్టార్టప్‌ ముఖ్య ఉద్దేశం. మనుషుల కృత్తిమ అవయావాల్ని అంతరిక్షంలో స్టోర్‌ చేయడమే. అలా స్టోర్‌ చేసిన ఆర్టీఫిషియల్‌ ఆర్గాన్స్‌ను ట్రీట్మెంట్‌ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడీ ఈ స్టార్టప్‌ ఐడియా అమెరికాలో హాట్‌ టాపిగ్గా మారింది. ఎందుకంటే స్పేస్‌ టూరిజం ఊపందుకోవడంతో.. ఈ ఇద్దరు యువకులు చేస్తున్న ప్రయోగం విజయవంతం అవుతుందని అందురు భావిస్తున్నారు. అందుకే ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు.   

ఆ పెట్టుబడులతోనే ఆ ఇద్దరు యువకులు ముందుగా వాళ్లు తయారు చేస్తున్న క్యాప్సుల్స్‌లో కొన్ని వస్తువుల్ని స్పేస్‌లోకి పంపించాలని ప్రయోగాల్ని కొనసాగిస్తున్నారు. అదే విజయవంతం అయితే కృత్రిమ మానవ అవయవాలను స్పేస్‌లో స్టోర్‌ చేసి.. అవసరం అనుకున్నప్పుడు ఆస్పత్రికి తరలించవచ్చు. ఇందుకోసం అంతరిక్షంలో స్పేస్ స్టోరేజ్ యూనిట్లు మొబైల్ హాస్పిటల్ యూనిట్లను ఏర్పాటు చేయోచ్చని జస్టిన్ ఫియాషెట్టి, ఆస్టిన్ బ్రిగ్స్ చెబుతున్నారు. మరి వాళ్లిద్దరు ప్రారంభించిన స్టార్టప్‌ విజయ వంతం అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరిన్ని ప్రయోగాల్ని చేయాల్సి ఉంటుంది.

చదవండి: గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంతే! ఎలన్‌ మస్క్‌ యుద్ధం వచ్చినా ఆగేలా లేడే!

మరిన్ని వార్తలు