ఓయో, జొమాటో, స్విగ్గీ !! నిమిషానికి ఎంత న‌ష్ట‌పోయాయో తెలుసా?

20 Feb, 2022 15:33 IST|Sakshi

ఉదాహ‌ర‌ణకు మ‌న‌కు ఓ స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు ఆ స‌మ‌స్య‌కు ఇన్నోవేటీవ్‌గా ప‌రిష్కారం చూపించే సంస్థ‌ల్ని స్టార్ట‌ప్స్ అంటారు. ఈ స్టార్ట‌ప్ లో లాభాలు ర్యాపిడ్‌గా గ్రో అవుతుంటాయి. మిలియ‌న్ సంఖ్య‌లో యూజ‌ర్లు ఉంటారు. కోట్ల ట‌ర్నోవ‌ర్ జ‌రుగుతుంటుంది. అలాంటి స్టార్ట‌ప్స్ కు కోవిడ్ మ‌హ‌మ్మారి వంద‌ల కోట్లు న‌ష్ట‌యేలా చేసింది. 

ఇటీవ‌ల విడుద‌ల ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ 2020-2021లో స్టార్ట‌ప్ కు ఎంత న‌ష్టం వాటిల్లింది. నిమిషానికి న‌ష్ట‌పోయాయో తెలుపుతూ కొన్ని రిపోర్ట్‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ఆ అధ్య‌య‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

రితేష్ అగర్వాల్ స్థాపించిన స్టార్టప్ ఓయో రూమ్స్‌ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ 2020-21 రూ.3943.84 కోర్ల నష్టాలను చవిచూసింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రతి నిమిషానికి రూ.76,077కు పైగా నష్టపోయింది. 

ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ యాప్ స్విగ్గీ  గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,314 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే స‌మ‌యంలో కంపెనీ నిమిషానికి రూ.25,347కు పైగా నష్టపోయింది.  

 పేమెంట్స్ సర్వీస్ స్టార్టప్ మోబీక్విక్ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్‌లో రూ.111.3 కోట్లు న‌ష్ట‌పోయింది. అంటే ఆర్థిక సంవత్సరంలో స్టార్టప్‌కు నిమిషానికి రూ.2,147 నష్టాలు వచ్చాయి. 

మ‌రో డిజిట‌ల్ పేమెంట్ దిగ్గ‌జం పేటీఎం డిసెంబర్ త్రైమాసికంలో రూ. 778.5 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంటే ఈ కాలంలో స్టార్టప్ ప్రతి నిమిషానికి రూ.60,069కి పైగా నష్టపోయింది.  

బీమా ప్లాట్‌ఫారమ్ పాలసీబజార్ డిసెంబర్ త్రైమాసికంలో రూ.298 కోట్లు నష్టపోయింది. ఈ కాలంలో కంపెనీ ప్రతి నిమిషానికి రూ. 22,995 నష్టపోతున్నట్లు వెలుగులోకి వ‌చ్చిన నివేదిక‌లు పేర్కొన్నాయి. 

► ఆన్‌లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో గత త్రైమాసికంలో రూ. 63.2 కోట్ల నష్టాన్ని నివేదించింది. నిమిషానికి రూ. 4,876 నష్టాన్ని నమోదు చేసింది.   

మరిన్ని వార్తలు