పీఈ, వీసీ పెట్టుబడులు వీక్‌

17 Dec, 2022 12:05 IST|Sakshi

నవంబర్‌లో 42 శాతం క్షీణత

ముంబై: గత నెలలో ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) ఫండ్స్‌ పెట్టుబడులు వార్షికంగా 42 శాతం నీరసించాయి. 4 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే నెలవారీగా చూస్తే అంటే 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఇవి 18 శాతం పుంజుకున్నట్లు పారిశ్రామిక సంస్థ ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది.

వెరసి వరుసగా రెండో నెలలోనూ పెట్టుబడులు బలపడినట్లు తెలియజేసింది. ఈ వివరాలు ప్రకారం గత నెలలో నమోదైన లావాదేవీల సంఖ్య 2021 నవంబర్‌తో పోలిస్తే 15 శాతం తక్కువగా 88కు చేరగా.. అక్టోబర్‌తో చూస్తే 13 శాతం అధికమయ్యాయి. కాగా.. 2022 నవంబర్‌లో 29 అమ్మకం(ఎగ్జిట్‌) డీల్స్‌ జరిగాయి. వీటి విలువ 1.8 బిలియన్‌ డాలర్లుకాగా.. 2021 నవంబర్‌లో 3.1 బిలియన్‌ డాలర్ల విలువైన 21 లావాదేవీలు జరిగాయి. ఇక 2022 అక్టోబర్‌లో 1.6 బిలియన్‌ డాలర్ల విలువైన 15 ఎగ్జిట్‌ డీల్స్‌ నమోదుకావడం గమనార్హం.

చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్‌ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్‌!

మరిన్ని వార్తలు