గృహ రుణాలపై ప్రాసెస్‌ ఫీజు మినహాయింపు

1 Aug, 2021 04:43 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆగస్టు 31 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం హౌసింగ్‌ లోన్స్‌ మీద ప్రాసెసింగ్‌ ఫీజు 0.40 శాతంగా ఉంది. ఎస్‌బీఐ మాన్‌సూన్‌ ధమాకా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, గృహ రుణ కస్టమర్లు ఈ సేవలను పొందవచ్చని బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు 6.70 శాతం నుంచి ప్రారంభమవుతాయని.. ఇల్లు కొనేందుకు ఇంతకుమించి మంచి తరుణం లేదని పేర్కొంది. ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకు గృహ రుణాలకు 5 బీపీఎస్‌ (0.05 శాతం), మహిళ గృహ రుణగ్రహీతలకు 0.05 శాతం రాయితీకి అర్హులని ఎస్‌బీఐ ఎండీ (రిటైల్‌ అండ్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌) సీఎస్‌ శెట్టి తెలిపారు. 

మరిన్ని వార్తలు