స్టీల్‌ తయారీలో నంబర్‌ 1 కావాలి 

24 Aug, 2022 13:33 IST|Sakshi

స్టీల్‌ఉత్పత్తిలో ప్రపంచంలోనే  నెంబర్‌ 1 కావాలి:  కేంద్ర మంత్రి సింధియా 

న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో భారత్‌ స్టీల్‌ తయారీలో ప్రపంచంలోనే నంబర్‌ 1 స్థానానికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యక్తం చేశారు. దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఉక్కు లేదా 'మేడ్ ఇన్ ఇండియా' ఉక్కును ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన  నొక్కిచెప్పారు,

ప్రస్తుతం చైనా తర్వాత ముడి స్టీల్‌ తయారీలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఎన్‌ఎండీసీ, ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. భారత్‌ స్టీల్‌ విషయంలో నికర దిగుమతిదారు నుంచి నికర ఎగుమతిదారుగా అవతరించినట్టు చెప్పారు. తలసరి స్టీల్‌ వినియోగం 2013-14లో 57.8 కిలోలు ఉంటే, అది ఇప్పుడు 78 కిలోలకు పెరిగిందన్నారు.  ఉక్కు రంగంలో అధిక కర్బన ఉద్గారాల విడుదలపై ఆందోళన వ్యక్తం చేసిన సింధియా, 2030 నాటికి ఈ స్థాయిలను 30 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే 2030 నాటికి 300 మిలియన్‌ టన్నుల స్టీల్‌ తయారీని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు