స్టెరిలైట్‌ టెక్‌ టర్న్‌అరౌండ్‌

28 Jan, 2023 06:10 IST|Sakshi

క్యూ3లో రూ. 50 కోట్ల లాభం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆప్టికల్, డిజిటల్‌ సొల్యూషన్ల కంపెనీ స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నష్టాలను వీడి రూ. 50 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో వన్‌టైమ్‌ ప్రొవిజన్‌తో కలిపి రూ. 138 కోట్ల నికర నష్టం ప్రకటించింది.

మొత్తం ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 1,882 కోట్లను తాకింది. మొత్తం ఆర్డర్‌బుక్‌ రూ. 12,054 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. వృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టడం, నిర్వహణా సామర్థ్యాల మెరుగు, పెట్టుబడుల వ్యూహాత్మక కేటాయింపు వంటి అంశాలు పటిష్ట పనితీరుకు సహకరించినట్లు పేర్కొంది.  

ఫలితాల నేపథ్యంలో స్టెరిలైట్‌ టెక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 2.6 శాతం నష్టంతో రూ. 175 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు