స్టీవ్‌జాబ్స్‌ క్రేజ్‌.. వేలంపాటలో మిలియన్ల డాలర్లకు పోయిన సంతకం

21 Aug, 2021 12:46 IST|Sakshi

Steve Jobs Autograph: టెక్నాలజీ ఎరాలో యాపిల్‌ ఆవిష్కరణ ఒక కీలక పరిణామమనే చెప్పొచ్చు. అందుకే యాపిల్‌ ఫౌండర్‌ స్టీవ్‌ జాబ్స్‌ను ఓ పాథ్‌ మేకర్‌గా భావిస్తుంటారు. చనిపోయాక కూడా ఆయన లెగసీ కొనసాగుతూనే వస్తోంది. తాజాగా ఆయన సంతకంతో ఉన్న ఓ కంప్యూటర్‌ మ్యానువల్‌.. వేలంపాటలో సుమారు ఆరు కోట్ల రూపాయలను దక్కించుకుని వార్తల్లో నిలిచింది.

1977లో యాపిల్‌ II కంప్యూటర్‌ రిలీజ్‌ అయ్యింది. దాదాపు రెండేళ్లపాటు నడిచిన ఈ వెర్షన్‌.. పర్సనల్‌ కంప్యూటింగ్‌లో, కంప్యూటర్‌ల బిజినెస్‌లో విప్లవాత్మక మార్పునకు కారణమైంది. అలాంటి కంప్యూటర్‌కు చెందిన మ్యానువల్‌పై స్టీవ్‌ జాబ్స్‌, యాపిల్‌ సెకండ్‌ సీఈవో మైక్‌ మర్‌క్కులా 1980లో సంతకం చేశారు. యూకేకు చెందిన ఎంట్రప్రెన్యూర్‌ మైక్‌ బ్రివర్‌(తర్వాత యూకే యాపిల్‌ కంప్యూటర్‌కు ఎండీ అయ్యాడు) కొడుకు జులివాన్‌ కోసం దానిపై సంతకం చేశారు వాళ్లు. ‘‘జులివాన్‌.. మీ జనరేషన్‌ నడక కంప్యూటర్లతో మొదలైంది. మార్పునకు సిద్ధం కండి’ అంటూ దాని మీద స్టీవ్‌ జాబ్స్‌ చేత్తో రాసిన రాత కూడా ఉంది.

మైక్‌తో స్టీవ్‌ జాబ్స్‌ 

బోస్టన్‌కు చెందిన ఆర్‌ఆర్‌ ఆక్షన్స్‌ కంపెనీ ఈ అటోగ్రాఫ్‌ కాపీని వేలం వేసింది. మొత్తం 46 బిడ్లు దాఖలు కాగా, విన్నింగ్‌ బిడ్‌ 7,87,484 డాలర్ల(మన కరెన్సీలో 5.8కోట్ల రూపాయలకు పైనే) బిడ్‌ ఓకే అయ్యింది. ఇండియానా పొలిస్‌ కోల్ట్స్‌కు చెందిన.. జిమ్‌ ఇర్సే దీనిని దక్కించుకున్నట్లు తెలస్తోంది. ‘‘ఆరోజు జాబ్స్‌, మర్‌క్కులా మా ఇంటికి వచ్చారు. బెడ్‌రూంలో ఉన్న నేను.. ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్లా. నా ఆత్రుత చూసి దగ్గరికి తీసుకుని.. నా దగ్గర ఉన్న మ్యానువల్‌పై సంతకం చేసిచ్చారు వాళ్లు’ అని ఆనాటి సంగతిని గుర్తు చేసుకున్నాడు జులివాన్‌. ఇక 1973లో స్టీవ్‌ జాబ్స్‌ ఓ కంపెనీలో ఉద్యోగం కోసం చేసుకున్న చేతిరాత దరఖాస్తు కాపీని..  యూకేలోని ప్రముఖ సంస్థ చార్టర్‌ఫీల్డ్స్ వేలం వేయగా సుమారు రూ. కోటిన్నరకు పోయింది.

చదవండి: IPO-ప్రజల నుంచి 70వేల కోట్లు!!

మరిన్ని వార్తలు