ప్రముఖ స్టాక్‌మార్కెట్‌ విశ్లేషకుడు ఇకలేరు!

27 Feb, 2023 17:13 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు అశ్వనీ గుజ్రాల్ (52) ఇ‍కలేరు. సోమవారం (ఫిబ్రవరి 27న) ఆయన కన్నుమూశారు. భారతీయ స్టాక్ మార్కెట్‌లో సాంకేతిక విశ్లేషణలో విశేష నైపుణ్యంతో పాపులర్‌ ఎనలిస్ట్‌గా గుర్తింపు పొందారు.  ముఖ్యంగా  సీఎన్‌బీసీ టీవీ 18లో,ఈటీ నౌ లాంటి బిజినెస్‌ చానెళ్లలో రోజువారీ  మార్కెట్‌  ఔట్‌లుక్‌, ఇంట్రాడే ట్రేడింగ్‌ సూచనలు, సలహాలతో  ట్రేడర్లను ఆకట్టుకునేవారు. 

మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుండి  ఎంబీఏ(ఫైనాన్స్) పట్టా పొందిన గుజ్రాల్ 1995 నుండి తన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వృత్తిని ప్రారంభించారు. ఈ క్రమంలో మార్కెట్‌లో మనీ సంపాదించాలి, ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎలా చేయాలి అనే అంశాపై మూడు పుస్తకాలను కూడా రాశారు గుజ్రాల్‌. అలాగే యూఎస్‌ ఆధారిత మ్యాగజైన్‌లు , జర్నల్స్‌లో ట్రేడింగ్ , టెక్నికల్ అనాలిసిస్‌పై రాశారు.

మరిన్ని వార్తలు